పుట:Kasiyatracharitr020670mbp.pdf/402

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీబ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్టణపు వుపపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీధులు కలవి. వీధులు తెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నెలు పందిళ్ళుచేతనున్ను అలంకరించబడివున్నవి. సుందరమయిన దేవాలయము తటాక సహితముగా వున్నది. సమస్తపదార్ధాలు దొరుకును. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచల శెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు 2000 వరహాలదాకా ఖర్చు చేసి జరిగింపుదున్నాడు. ఆ ధర్మము కాక అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆ వాసన యీ పురుషుణ్ని బాగా పట్టి వున్నది.

యీ స్థల మహాత్మ్యము యే మంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబర వృక్షము కలగచేసి చండవాయువు చేత ఆవృక్షమును యుక్తప్రదేశములో నిలుపుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను దాన్ని వేళ్ళపుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతోశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణదేవతలు ఆచెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అఘుపి8మ్మట యీస్థలములో వసించగలందులకు పార్వతిని రమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడ యివ్వకగాని తాను రానని చెప్ప్నట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆదిశేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాది వుండేటట్టున్ను పార్వతీదేవినిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టి స్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను