పుట:Kasiyatracharitr020670mbp.pdf/371

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాడు గనుక అతని వంశస్థుడైన రవణప్ప ఆ సత్రము లోకోపకారముగా బహుచక్కగా నడిపింపుచున్నాడు. యీ దినము మేము కొంచము తడిశినందున యీ రాత్రికూడా నిలిచినాను. యీవూళ్ళో వచ్చిన సమస్తజాతిపాంధులకు కావలసిన భోజనసామానులు యీ సత్రములో బలవంతముచేసి కావలిస్తే పక్వాన్నముగాకూడా పెట్టుతారు. అంగళ్ళు విచారించనక్కరలేదు. 40 బ్రాహ్మణయిండ్లున్నవి. మంచి వసతైన గ్రామము.

యీవూరికి రెండుకోసులదూరములొ సింహ్వాచల మనే మహా స్థల మున్నది. ఆ గుడిఖర్చుకు సాలుకు 10 వేల రూపాయిలు తగులు చున్నవి. యీ ధర్మము విజయనగరపురాజు పరిపాలనఛేయుచున్నాడు. యీస్థల మహాత్మ్యము ప్రహ్లాదుణ్ని తండ్రిదండనవల్ల నివర్తింప చేసి కాపాడిన అవసరము. యీ మూర్తి పేరు వరాహ నరసింహమూర్తి. అనేక జలధారలు స్రవింఛే పర్వతము మీద వరాహాకృతిగా ఆ మూర్తి వొకమందిరములో వసించివున్నాడు. 200 వైష్ణవుల యిండ్లు యీ స్థలమందున్నవి. రాజోపచారములతో యీ మూర్తిని ఆరాధింపుచున్నారు. అక్షతదియతప్ప మరియేదినము ఆ మూర్తి దర్శనములేదు. తతిమ్మా దినాలు చందనముచేత ఆ మూర్తిని కప్పివుంటారు. యీ మూర్తియొక్క ధాన్యశ్లోకము యీ అడుగున వ్రాయుచున్నాను. శ్లోక: త్రాహీతి వ్యాహరంతం త్రిదశా రిపుసుతం పాతుకామ స్స్వభక్తం ı విస్రస్తం పీతవస్త్రం జిజకటియుగళే నవ్యహస్తే గృహ్ణన్ ı వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయ న్యస్స్వపాణౌ ı సింహాద్రౌ శీఃఘ్రపాతక్షితినిహితపద: సాతుమాం నారసింహ: యీ శ్లోకమే యీస్థల మాహాత్మ్యానకు సంగ్రహమని తెలియవలసినది.

14 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కదికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు 9 గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్ను40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి.