పుట:Kasiyatracharitr020670mbp.pdf/341

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిప్పువు వుపాయముచేత క్రీస్తుమతస్థులు తమ మతములో చేర్చిన హిందువులలో సహస్రములో వొకపాలైనా ఆ కాలమందు మహమ్మదుమతములో హిందువులు ప్రవేశించక మహమ్మదు మతస్థులను క్రమక్రమశ: తమ మతముజోలికి రాకుండావుండేటట్టు చేసుకొని యిడిసిన దేవాలయాలను బ్రహ్మాలయాలను మళ్ళీ వుద్ధరించుకుంటూ వచ్చినారు. క్రీస్థుమతస్థులు 'ఉపాయేవతు యచ్చక్యం సతచ్చక్యం పరాక్రమై:' అనే వచనప్రకారము క్రమక్రమముగా యీ దేశములో గౌరవము సుతరాంలేకుండా వుండే జాతిని విస్తారముగా తమమతములో చేర్చుకొని కర్మఫలము యొక్క రహస్యము తెలియని వారిని క్రీస్తు మతమే వుత్తమమని చెప్పుకుంటూ వుండేటట్టు యెప్పటికిన్ని చేసి వున్నారు.

మహమ్మదు మతానకు క్రీస్తుమతానకున్ను (హిందూమతానకున్ను) వుండే తారతమ్యములను గురించి నేను ఒకకధ వినడమయినది. అది యేలాగంటే వొక ప్రభువు ఈ మూడుమతస్థులను వద్దవుంచు కొని వొక ప్రశ్నచేసినాడట. ఆ ప్రశ్న (ఏది) అనగా వొక దారిమధ్యే వొకడు భాటసారిని కొట్టి నిర్భంధపెట్టి తన యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిచ్చేటట్టు సంకల్పముచేసుకొని యిల్లు కట్టుకొని కాపురము చేయుచూ వచ్చినాడు. మరినొకడు తన యింటియొక్క సౌఖ్యమును తన ఆతిధ్యముయొక్క రుచినిన్నిభోధచేసి దారిన నడిచేవారిని యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిస్తూ వచ్చేటట్టు సంకల్పముచేసి వొక యిల్లు కట్టుకుని కాపురము చేయుచువున్నాడు. మరివొకడు తనయింటికి వొకరిని పిలువవలసినది లేదు, నేను వొకరింటికి వొకరివద్దికి పోను, నా అంతట నేనువుండ వలసినదని నిశ్చయము చేసి యిల్లు కట్తుకుని కాపురము చేయుచు వచ్చినాడు. యీముగ్గురిలో యెవడు వుత్తముడని పై ముగ్గురి మతస్థులను ప్రశ్నచేసినంతలో మహమ్మదు మతస్థుడు బోధించి పిలుచుకుని వచ్చేవాణ్నిన్ని తావులో పడివుండే వాణ్నిన్ని నపుంసకులుగా నిందించి ఆతిధ్యము యివ్వవలెనని తోచినప్పుడు వెర్రితనముచేత దారిపొయ్యేవారు రాకపోతే తన్ని ఆదిధ్యము యిచ్చేదే పురుషవాహిని యని ప్రత్యుత్తరము యిచ్చినాడట. క్రీస్తుమతస్థుడు నిర్భంధము చేసేవాణ్ని