పుట:Kasiyatracharitr020670mbp.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాయుభూతజన్య మయిన తిర్యగ్జంతు దేహముల కన్నిటికి త్వక్కు చర్మము మాంసము మొదలైన అన్ని వస్తువులు గలిగినా వాటివల్ల శిర:పాణి పాదావయవాలు వుద్భవించినా అవస్థాత్రయము ఇంద్రియాలద్వారా వున్నా ఆకాశానికి బదులు వాయునే అంతరత్మ అయి వాటి ఆత్మలను కల్పించెను గనుక ప్రకృతి దేహాలవలెనే తిర్యగ్జంతువులు సుషుప్త్యవస్థా వంతరము 'యీ వరకు సుషుప్తి యనే అవస్థను నేను పొంది వుంటిని ' అని అనుకోవడానకు నాటి దేహములలో వస్త్యంతరమున్ను తెలివిన్ని లేదు. ఆ వస్తువే పరమాత్మభాతి అని తెలుసుకోవలసినది. అగ్నిభూతజన్యమైన వృక్షాదులలో అగ్ని మహాభూతమే వాటికి ఆత్మగా తన ప్రతిభాతి ద్వారా యేర్పడి నందున ఆ సృష్టికోటిని తిర్వగ్జంతువులకున్ను భిన్నముగా మొరివొకవిధమయిన తక్ చర్మ మాంసాదులతో వాటి దేహములు యేర్పడి శిర:పాణి పాదాలుగా వుండే అవయవములు పరిష్కాతముగా యేర్పడక యింద్రియములు జనించక బీజాంకురాలను మాత్రము కల్పించుదున్నది. అప్పుభూతము యొక్క సృస్టిలో ఆకాశము, వాయువు, వహ్ని యీ మూడు భూతముల ప్రతిభాతి లేనందుననున్ను స్వయం అప్పుభూతమే సదమునదులు మొదలయిన జలరాశి స్వరూపము ధరించుట ఛేత చలనశక్తి మాత్రము వాటికి కలిగి వురుషభూతముల సృష్టికోటిని కాపాడుతూ వున్నది. పృధివీభూతము తన సృష్టి అయిన మృత్తు మొదలయిన వస్తువులలో పయి నాలుగు మహాభూతముల వ్యాప్తి లేనందున చలనశక్తి కూడా లెకుండా పురుషభూతసృష్టిని ధరించి అప్పుసృష్టి సహాయ ద్వారా వాటిని పరిపాలన చేయుచూ స్థితిని పొందియున్నది.

యీ ప్రకారము యీ బ్రహ్మాండములలో సృష్టి అయిన సకల మున్ను ఆకాశ మహాభూతమువల్ల సృష్టి అయిన ప్రకృతి దేహముల పరిపాలనార్ధమే గనుక యీ ప్రకృతి దేహములు మిగిలివుండే సృష్టికోటిని యేలుబడిచేయు చున్నవి. యీ యిక్తిమీద విచారించగా ప్రతి బ్రహ్మాండమునకున్ను అటువంటి పరమాత్మ ప్రతిభాతికి