పుట:Kasiyatracharitr020670mbp.pdf/283

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అండవాయువులు యింగిలీషువారు చెన్నపట్టణములోవశిస్తూ వుండగా వారికి లేక నల్లవాండ్లము మాత్రము ఆ భూమిలో కలగడ మే మని కొందరు దొరలను అడిగివుంటిని. వారు దీన్ని గూర్చి యోచించి తమ డాక్జ్టరులు అందరున్ను కూడి నిశ్చయముచేసిన తీర్పుసంగతిని నాతో చెప్పినారు. అది యేమంటే యౌవనప్రారంభాత్పూర్వమే నల్లవాండ్లు స్త్రీభోగములలో ప్రతివర్తింపుచున్నారు గనుక స్త్రీ సంచారము మిక్కటము కావడమే అండవాయువు ఉపద్రవము కలుగుటకు కారణ మని నిశ్చయించినారట. ఆ కారణమువల్లనే యీ మగధ దేశములో అండవాయువులు విస్తరించివున్న వని విచారణమీద తెలిసినది. కాబట్టి చెన్నపట్టణానుభవముచేత నున్ను, మగద దేశపు వర్తమానము తెలిసినందుననున్ను, డాక్టరులు చెప్పినయోచన సరే నని నిశ్చయించడమయినది.

యీ దేశపు రేగుపండ్లు బహు యోగ్యములుగా వున్నవి. నిడువు అందముతో పొట్టివిత్తులు కలవిగా అతి మాధుర్యము గలిగి పురుగులు లేకుండా వున్నవి. యీ పండ్లు అమితముగా అమ్మడము కలిగి వున్నది. యీ దేశమంతా తట్టలతో భోజనము చేయుచు నుండడమున్ను, మర్రిచెట్టు పూరార్హముగా వుండడమున్ను, యిప్పపూలతో సారాయి దించడమువల్ల వాటి ఆకులు కోయడము లేక వుండడమున్ను మోదుగచెట్లు విస్తరించి లేక వుండడమున్ను యిక్కడా కలిగి వున్నందున పట్టణములలో కూడా విస్తళ్ళు దొరుకుట ప్రయాస ముగా నుండును. దొరికినా భోజనయోగ్యములుగా వుండవు. చేసుకొని వుంచుతూ రావలసినది. హిందూస్తాన్ యావత్తున్ను రొట్టెల వలెనే అన్నమునున్ను ప్రతిదినము భోజనము చేయుచున్నారు. గనుక చింతపండు మిరపకాయలు మొదలయినవి సహజముగా యెక్కడపడితే అక్కడ దొరుకుతూ వచ్చుచున్నవి.

యిక్కడి రూపాయి 1 కి పయిసాలు 34. పయిసా 1 కి గవ్వల పుంజీలు 24. పుంజీ 1 కి గవ్వలు 4. కట్టెలు మొదలుగా సకల పదార్ధాలున్ను తూనికెమీద అమ్ముతున్నారు. తూనికె