పుట:Kasiyatracharitr020670mbp.pdf/266

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ళములవలెనే అయ్యేటట్టుగా జాగ్రత్త పెట్టించినాడు. కాశీనుంచి వచ్చేదారిలో చప్రా అనేషహరులో లోగడ చన్నపట్టణములో ఆక్టింగు గౌనరుగా వున్న గ్రీందొరగారు జననమయి వారి తండ్రిగారు అక్కడ బహుకాలము అధికారము చేసినందున వారి పాత నవుకరులకు కొంత యినాములు యిచ్చి వారి కుశలము విచారించే కొరకు నన్ను కొన్ని దినములు చప్రాలొ నిలువు మని చెప్పినందున ధనుగ్రయ త్వరగా ఆరంభించడానకు కొంత ఆలస్య పడ్డరి గనుక ధనుర్మాసములో గయావ్రజనము సమాప్తి కాక పొయినా ఆరంభము మాత్రము ధనుర్మాసములోనే చేసినాను.

గయాక్షేత్రము మహా గొప్పపట్టణము. అందుకు వుత్తర భాగ మందు 50 యేండ్లుగా యింగిలీషువారు సాహేబు గంజు అని 2 కోసుల దూరములో తాము యిండ్లు తోటలు కట్టుకొని ఒక బస్తీ చేసినారు. అక్కడ అనేక మళిగలు గొప్పబజారు వీధిన్ని యేర్పడ్డది. సకలపదార్ధాలు ఆబజారులో చవుక. ఆసాహేబుగంజు బస్తిన్ని గయాషహరున్ను యిప్పట్లో యిండ్ల సమూహముతో కలిసి వున్నది. రెండు స్థలాలలో మూడు వేలయిండ్లున్ను 15000 వేల మంది ప్రజలున్ను కలిగి వుండునని తోచుచున్నది. గయలో ఒక మేజస్ ట్రేటు ఒక జిల్లాజడ్జి, ఒక డాక్టరు, యాత్రదారుల వద్ద మహస్సూలు వసూలు చేయడానికి ఒక టాక్సుకలకటరు జిల్లాకలకటరుకు అంతర్బూతముగా వున్నారు. గయాపట్నము బాహారుజిల్లాతో చేరినది. కలకటరు హుజూరి కచ్చేరి యిక్కడ బహుకాలము వశింపుచూ వుంచున్నది. యిక్కడ సకల పదార్ధాలు ద్వీపాంతర వస్తువులు సకల విధములయిన పనివాండ్లు కలరు. గడియారము చక్క పెట్టడానకు పనివాండ్లుమాత్రము పట్నా షహరులో వుండేటట్టు మిక్కటము యిక్కడలేదు. మిఠాయి అంగళ్ళలో తిలలతో అనేక దినుస్సులు భక్ష్యరూపములుగా చేసి అమ్ముతారు. వాటిఆకుకూరకు నిండా బాగా వుంచున్నది. యెర్రమందారపు మొగ్గలు అమితముగా తెచ్చి కూరకు అమ్ముతారు. అది పెసలపప్పుతో కలిపి వండితే బహు