పుట:Kasiyatracharitr020670mbp.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

వాగులు, నదులున్ను వివరించి వ్రాయుచు వచ్చినానుగదా! ఊరికే దాటవలెనని నేను వాయుచు వచ్చిన వాగులంతా కాలినడకగా దాటతగ్గవని తెలిసి యుండవలసినది. నిన్న దాటిన జూబా నదివద్ద ఇంరుపక్కల రెండు కొయ్యలు నాటి రెండు కొయ్యల తలలకు ఒక కప్పితాడు కట్టినారు. తపాలాకట్ట రాగానే ప్రవాహకాలాలలో పక్కకు ఒక హరకాతా వంతున ఇరుపక్కల కాచియుండి తపాలా కట్టను కప్పికి కట్టివేస్తే యివతలి పక్కవాడు యీడ్చుకొనేటట్టు చేసి నారు. రాయచౌడువద్ద ఒక కొండ యెక్కిదిగవలసినది. యీ రాయచౌడు జలవసతి కలది. పెద్ద చెరువు కొండను కట్టగా చేసుకొని యున్నది. యీకట్టమీదనే అప్పాసాహెబు అనే నాగపూరి రాజును కొంఫిణీవారు ఖయిదు చేసి తీసుకొని వచ్చుచుండగా తప్పించుకొని పరుతెత్తిపోయినాడు. ఇక్కడ దిగడానకి అంగళ్ళవాండ్లు, యధోచిత వసతి గలవిగా చావళ్ళు కట్టి పెట్టినారు. అందులోనే దిగినాను. సకల పదార్ధాలు ముసాఫరులకు దొరుకును.

ఇటువంటి కాలు దిగబడే అడుసు, రాతిగొట్టు, ముండ్లు, వొరుగుడు, కాలువలు, వాగులు, కొండలెక్కి దిగడము, వీటివల్ల కలిగే ప్రయాసను ఓర్చి అర్ధముకన్నా దేహముమీది యభిమాన మెంత జఘన్యునికిన్ని యెక్కువగా నుండవలసినది సహజమై యుండగా కొంచానికి ఒకరితో నొకరు కలహమాడే బోయజాతి ఒక జతగా కలిసి యేకవాక్యతను పొంది దోవ సాగించడము ఎందువల్ల నని ఊహించితిని. అర్ధాపేక్ష చేత ఓర్చుచున్నా రందామంటే లొభులవద్ద అర్ధము గుంజలి స్తే వారి దేహమును బాధించి అర్ధాకర్షణ చేస్తారు. అప్పటికి అర్ధాపేక్షచేత సామాన్యముగా మనుష్యులు దేహకష్టమును మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకరు కాకుంటే ఒకడు యిటువంటి మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకడు యిటువంటి మిక్కుట మైన కష్టము వచ్చినప్పుడు నాకు రూకవద్దబ్బా అని వెనక తీసిపొవును. రాజాజ్ఞచేత సహిస్తారందామంటే మిక్కుటమయిన కష్టవు మోత కలిగి నప్పుడు ఒకడుకాకుంటే ఒకడు ఇప్పుడు దేహానికి ఆశక్తి వచ్చినది, యీ కష్టపుమోత నేను మోయలేనని తిరగబడితే రాజయినా ఏమిచేయగలడు? గనుక అదిన్ని కారణముకాదని తొచినది. అప్పటికి