పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండోపాళీ వేళకు వెళ్లితిమిగాని, జనమెక్కువగా వుండటంచేత కొందర్ని మూడోపాళీదాకా దిగద్రొక్కినారు.

ఆ కారణంచేత అధమం గంట గంటన్నర ఆలస్యమయింది. ఇంతలో నాకు నోరెండుకుపోవుట మొదలైన అవలక్షణాలు బయలుదేరాయి. "సభలో అంతా గొల్లలే", అన్నట్లు యెవరితో చెప్పికొన్నా లాభములేదు. అంతా భంగుమత్తుమీదున్నవారే. నా మొర వినేదెవరు? ప్రతిక్రియ చేసేదెవరు? వారు ఆ మత్తును ఆపుకోగలవారు, నేను ఆపుకోలేని వాడను; ఇంతే భేదము గాని, ప్రకృతిలోనున్నవారు ఆ జట్టులో నొక్కరున్నూ లేరు. పైగా నేనొకవేళ ప్రాణం పోతోందని మొరపెట్టుకొన్ననూ లాభము లేదు. చూచారు కాదూ, భారతంలో దేవయాని శుక్రాచార్యునితో కచుణ్ణి గూర్చి రాక్షసులు చంపేశారేమో అని యేడువసాగినప్పుడు, “సుగతికి జనుగాక యేల శోకింపంగన్" అని జవాబు చెప్పినాడు! అది ಹೆಣ) మాహాత్మ్యం? మద్యపు మాహాత్మ్యమే కదా! మద్యపానము దుఃఖమును తెలియనీయదనే కారణం చేతనే వైష్ణవ మతస్థులలో వామాచారులు" బంధుమరణములలో తుట్టతుద రోజున 'తొళ్లకు" మనేపేరుతో పూర్తిగా త్రాగుతారు. వైద్యశాస్త్రగ్రంథమగు రోలంబ రాజీయములో, దుఃఖము పోవుటకౌషధ మేమని ప్రశ్నించినప్పుడు సురాపాన మని జవాబు చెప్పినాడు. " సురకన్నను భంగు ప్రమాదకరమైన వస్తువు కాని, ఆ దేశములో ఇది పరమ పవిత్రము. పితృకార్యాలలో కూడా భోక్తలకు ముందుగా వీని నిచ్చియే భోజనం పెడతారు. అది యుటులుండె. ఆవేళకూడా చాలా శ్రమ