ఈ పుట ఆమోదించబడ్డది

7]

మహాశ్వేత కథ

49


మెంతచిత్రముగానున్నది. మొదటఁ ద్రిభువనాద్భుతరూప సంభారుఁడగు మన్మధుని సృష్టించి వానికన్న నెక్కువరూపముగలవానిఁ జేయు సామర్థ్యము కలదో లేదో యను తలంపుతో మునిమాయచేత రెండవ సుమకోదండునిగా నితవిఁ జేయఁబోలు. మున్కుమున్ను గజదానంద కరుండగు చంద్రుని లక్ష్మీలీలాభవనములగు పద్మములను సృజించుట బరమేష్టి కీతని మొగముజేయు పాటవము నేర్చుకొనుట కే యనితలంచెదను. కానిచో నతనికి సమానవస్తు సృష్టితోనేమి ప్రయోజన మున్నది. బహుళపక్ష క్షపాకరుని కిరణములను దరుణుండు హరించు చున్న వాఁడను మాట యళీకము. ఇమ్మునికుమారుని శరీరమందే యణంగుచున్నవి. కానిచోఁ గ్లేశబహుళమగు తపంబున నొప్పుచున్నను వీనిమేనింత లావణ్యభూయిష్టమై యుండనేల?

అని ఇట్లు విచారించుచున్న నన్ను రూపైకపక్షపాతి యగు కుసుమశరుఁడు పరవశనుగాఁ జేసెను.

నిట్టూర్పులతోఁగూడఁ గుడికన్నించుక, మూసి తిర్యగ్దృష్టిచే నతనిరూపము పానము చేయుదానివలె నెద్దియో యాచించుదానివలె నీదాననైతినని పలుకునట్లు హృదయమర్పించుపగిది మనోభవాభి భూతురాల నగు నన్ను రక్షించుమని శరణుజొచ్చుమాట్కి నీహృదయంబు నాకవకాశ మిమ్మని కోరుతీరునఁ జూచుచు అన్నన్నా! ఇది యేమిమోసము కులస్త్రీవిరుద్ధమగు బుద్ధిపుట్టినది ఇది గహి౯తమనియె ఱింగినదాననైనను నింద్రియప్రవృత్తుల మరలించు కొన వశముకాక స్థంభింపఁబడినట్లు వ్రాయబడినట్లు మూర్ఛబొందిన చందమున నవయవములు కదల్పలేక యట్టె నిలువంబడితిని. అప్పటియవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముకాదు. పూర్వము శిక్షింపబడినదికాదు.

తద్రూపసంపత్తుచేతనో మనస్సుచేతనో మన్మధునిచేతనో యౌవనముచేతనో యనురాగముచేతనో దేనిజేతను జేర్పబడితినో