ఈ పుట ఆమోదించబడ్డది

44

కాదంబరి

శిష్యుననుగ్రహింపుమని పలుకుచున్నను విడువకచ్చేడియ బలాత్కారముగా నతనికతిధిసత్కారముదీర్చినది. అతండును వంచిన శిరస్సుతో నతివినయముగా నయ్యాతిధ్యమందుకొనియెను.

అట్లాతిధ్యమిచ్చి యచ్చేడియ వేరొక శిలాతలమునఁ గూర్చుండి యొక క్షణ మూరకొని పిమ్మట నతని నాగమనకారణం బడుగుటయు నారాజపుత్రుఁడా పద్మనేత్రకు తాను దిగ్విజయయాత్రకు వెడలినది మొదలు కిన్నరమిథునాను సరణముగా వచ్చి యచ్చిగురుబోడిం జూచువరకు జరిగిన వృత్తాంతమంతయుం జెప్పెను.

అతని వృత్తాంతమంతయును విని యాజవ్వని సంతసించుచు భిక్షాకపాలమును గైకొని యవ్వనతరువులయొద్దకుఁ బోయెను.

అప్పుడు స్వయంపతితములైన ఫలములచే నా పాత్ర నిండినది. వానిం గొనివచ్చి యచ్చిన్నది యుపయోగింపుఁడని చంద్రాపీడు నొద్ద నుంచినది.

ఆచిత్రమంతయుం జూచి యతండు తలయూచుచు అన్నన్నా! తపంబునకసాధ్యమైనది లేదుగదా? అచేతనములగు నీవృక్షములు గూడ నీమె దయనుఁ గోరుచున్నవిపోలె వినమ్రతతో ఫలములనిచ్చినవి. ఆహా! ఇంతకన్న నబ్బురమెద్ది? అదృష్టపూర్వములగు నాశ్చర్యములం గంటినని మిగుల విస్మయముజెందుచు లేచి యచ్చటి కింద్రాయుధమును దీసికొని వచ్చి యనతిదూరమునఁ గట్టి యందున్న నిఝు౯రజలంబున స్నానము జేసి యమృతరసమధురములగు నా ఫలముల దిని చల్లని నీరు గ్రోలి నాయువతిగూడ ఫలహారము చేసి వచ్చువఱకు నేకాంతప్రదేశమునం గూర్చుండెను.

నిత్యక్రియాకలాపములు దీర్చుకొని ఫలరసముల ననుభవించి యాయించుబోడియు నొకశిలాతలంబునం గూర్చుండునంత నాప్రాంతమునకుఁ బోయి చంద్రాపీడుఁడు ననతిదూరంబునం గూర్చుండి యతి