ఈ పుట ఆమోదించబడ్డది

కిన్నెరమిధునముకథ

43

మునకుఁ బ్రదక్షిణముచేయుచు నొకమూల వినమ్రుఁడై యున్న యారాజకుమారుని నిర్మలమగు దృష్టి ప్రసారములచేతఁ బవిత్రము చేయునదివోలె వీక్షింపుచు నిట్లనియె.

అతిధికి స్వాగతమే? ఈమహాభాగుఁడీభూమి కేటికివచ్చెనో? అతిధి సత్కారమంద లేచి నాతో రావలసియుండునుగదా? యని పలికినవిని యచ్చంద్రాపీడుండు తత్సంభాషణ మాత్రమునకే తన్నను గ్రహించినట్లు తలంచుకొనుచు భక్తితో లేచి నమస్కరించి భగవతీ! భవదాజ్ఞానుసారంబున మెలంగువాఁడ నని వినయమునుఁ జూపుచు శిష్యుండువోలె నయ్యించుబోణి ననుగమించి నడచుచు నిట్లు తలంచెను. మేలుమేలు? నన్నుఁ జూచి యీచిన్నది యంతర్ధానము నొందలేదు. ఇదియు మదీయహృదయాభిలాష కనుకూలించియే యున్నది. తపస్విజన దుల౯భమగు దివ్యరూపముగల యీ కలకంఠికి నాయందెట్లు దాక్షిణ్యము గలుగునో యట్లు మెలంగువాఁడ. అడిగినచోఁ దనవృత్తాంత మిత్తన్వి నాకుఁ జెప్పకమానదు. కానిమ్ము. సమయమరసి యడిగెద నని తలంచుచు నూరడుగులు అప్పడఁతి వెంటనడిచెను.

పగలైననుఁ దమాలతరుచ్ఛాయలచే రాత్రిం బలెదోచు సమ్మార్గంబున నడువ మణికమండలు శంఖమయభిక్షాకపాల భస్మాలాబుకాదివస్తువులచే నొప్పుచుఁ భ్రాంతనిర్ఘ రీజల కణములచేఁ జల్లనైయున్న గుహాయొకటి గానంబడినది.

అయ్యిందుముఖ యచ్చాంద్రాపీడుని గుహాముఖశిలయందుఁ గూర్చుండఁ గను సన్నజేయుచు నవ్విపంచిని వల్కలతల్ప శిరోభాగమందుంచు పణ౯పుటంబున నిఝు౯రజలంబుబట్టి యఘ్యముగా నిచ్చుటయు నతండు భగవతీ చాలుచాలు అత్యాదరమును విడువుము నీకటాక్షలేశమే మదీయ పాపసముదాయముల బోగొట్టినది.