ఈ పుట ఆమోదించబడ్డది

32

కాదంబరి

విష్టులైయున్న సమయంబున నందున్న సామంతరాజులెల్లఁ దమపీఠాంబుల విడిచి నేలం గూర్చుండిరి. అప్పుడు మేనం బొడమిన పులకలచే హృదయగతహష౯ ప్రకష౯ము వెల్లడించుచు శుకనాసుండిట్లనియె.

తాత! చంద్రాపీడ! సమాప్తవిద్వుండవు సమారూఢయౌవనుండవు నగు నిన్నుఁ జూచుటచే; నిప్పటికి మాఱేనికి భువనరాజ్య ఫల్రప్తా కలిగినది. గురుజనాశీర్వాదము లన్నియు నిప్పటికి ఫలించినవి. అనేకజన్మోసాజి౯తమగు సుకృతము నేఁటికి పండినది. కులదేవత లిప్పటికిఁ బ్రసన్నులైరి. పుణ్యహీనులకు మీవంటి యుత్తములు పుత్రులుగా జన్మింతురా? నీ వయసెంత? అమానుషశక్తి యెంత? విద్యాగ్రహణసామర్ధ్య మెంత? ఆహా! ఈదేశప్రజలందఱు ధన్యులు గదా? ఈ భూభారమంతయు దంష్ట్రచే మహావరాహమువలెఁ దండ్రితోఁ గూడ వహింపుము.

అని పలుకుచు స్వయముగాఁ గుమారుకులకుఁ గుసుమాభరణాంగ రాగాదు లొసంగి యాదరించెను. తరువాత నాతనియనుమతివడసి రాజపుత్రుండు మిత్రునితోఁగూడ మంత్రిపత్ని మనోరమంజూచి యామె దీవెనల నంది యటఁ గదలి తండ్రిగారిచేఁ గ్రొత్తగాఁ దమకై నిర్మింపబడిన రాజకులముయొక్క ప్రతిచ్ఛందకము వలె నున్న మేడకుం బోయెను.

మరకతమణులచేఁ దోరణములుగట్టఁబడినవి. అనేక కనకదండచిత్రపతాకము లెగురుచుండెను. తూర్యనాదము మ్రోగించిరి. మహా వైభవముతో నమ్మేడలోఁ బ్రవేశించి చంద్రాపీడుఁడు వైశంపాయనునితోఁ గూడ వేడుకగాఁ గొన్నిదినములు గడిపెను.

మఱియొకనాఁడు కైలాసుండను కంచుకి పత్రలేఖయను నంబుజ నేత్రను వెంటఁ బెట్టికొని యచ్చటికి వచ్చెను. శక్రగోపకాతుల్యమగు నరుణాంశుకము ముసుంగుగావైచికొని బాలాతపమునఁ బ్రకా