ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

103


భవదంగభవపరితాపంబు జూడ సత్యము జెప్పుచున్నాను. నీకంటె నన్నెక్కుడుగా బాధించుచున్నది. పెక్కేల? దేహమిచ్చియైననిన్ను స్వస్థురాలిగాఁ జేయఁదలచుకొంటి నిందులకు నాహృదయము మిక్కిలి తొందరపడుచున్నది. అయ్యయ్యో! మన్మథునికి శరీరభూతములగు నీభుజలతను సంతాపదృష్టులచే గందజేయుచుంటివి? అశ్రుబిందు పాతంబున ముక్తాభరణత్వము గలిగి య్పొప్పుచుంటివి. పరాహ౯ములగు మంగళప్రనాదముల వహింపుము. నవలత సకుసుమశిలీముఖయై శోభించునుగదా? అని యడిగిన విని కాదంబరి బాలయు స్వభావ మగ్ధయనై నను గందర్పునిచే నుపదేశింపబడిన ప్రజ్ఞచేఁ దద్వాక్యము లందలి శ్లేషాధ౯మును గ్రహించియు నేమియుఁబ్రత్యుత్తర మీయక యన్యాపదేశముగా మందహాసము గావించినది. అప్పుడు మదలేఖ రాజకుమారా! ఏమందును. ఈసుందరి సంతాపమకధనీయమై యున్నది. సుకుమారభావముతోఁ గూడిన యీచేడియ కేది సంతాపముగాకుండెడిది? పద్మినికి వెన్నెలయు నెండగా నుండుంగదా? కిసల యతాళవృంతమున విసరుకొనుచున్న యీపూఁబోడి మనోభవభేద మేమిటికి తెలిసికొనజాలవు? ఈమెకు ధీరత్వమే ప్రాణసంధారణ హేతువు అని ప్రత్యుత్తర మిచ్చుటయు నాయాలాపములే యతని మాటలకు సరిపడియున్నవని కాదంబరి హృదయంబునం దలంచినది.

చంద్రాపీడుండు నమ్మాటలయందుఁగూడ నధ౯ద్వయము గలిగియుండఁ బట్టి తన డెందంబున గలిగిన సందియము దీరమింజేసి పరిపరివిధంబులం దలంచుచుఁ బ్రీత్యుపచయచతురములు మధురాలాపగర్భములు నగు కథలచే మహాశ్వేతతోఁగూడఁ కొంత గాలక్షేపము జేసి యతిప్రయత్నముతో నామెను విడిచి స్కంధావారమునుఁ బోవుటకు బయలుదేరెను.

గుఱ్ఱమెక్కఁబోవు సమయంబున గేయూరకుం డరుదెంచి