పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/330

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

319

నప్పుడే యిందు రావలయునని తలంచినది. ఎట్టకే నామె నందాపి భూపాలుని శయ్యాగృహ సమీపంబున కరిగితిని. అతఁ డందులేఁడు. నీపడకగదిలో నీపర్యంకముపైఁ బవ్వళించి నీచిత్రఫలకము జూచుచు హా ! ప్రేయసీ ! హా ! లీలావతి ! హా ! సతీలలామ ! నిన్ను నిరపరాధినిఁ బరిభవించితిని. పాపాత్ముండ నే నేనరకమునకుఁ బోవుదునో ! అక్కటా ! తొలుత నీవు నన్నుఁ బరిణియమగుటకు నడవులలో నెన్నియోయిడుములం గుడిచితివి. నడుమ నేమిసుఖించితివో గడియలాగైనది. తుదకు నిన్నడవులపాలు సేసితిని. ఈశయ్య నీతో నెన్నఁడుసుఖించితినో ! ఆహా! మోహనాంగీ ! నాతో మాటాడవా ? కోపమా ! ఓరీ ! భైరవా ! నా ప్రియురాలి నేమిచేసితివిరా ! మూర్ఖా ! నీపని నిఁకఁ బట్టించెదఁ జూడుము. ఈసందడిలో నీమాట మఱచితిని. నీయాట కింకను వ్యవధియున్నది కాఁబోలును. అంతవఱకు నిలువనేల నిప్పుడేపోయి వానిం బరిభవింతునా ? అని లేచి కత్తిదూసి యంతలో మఱల నయ్యసి వరలోఁ జొనిపి వాఁడు తాంత్రికుఁడు ఇంతలోఁ దొందరపడనేల ? వెనుకటివలెనే యాలోచింపక చేసితిమేని ప్రమాదము రాఁగలదు. అనిపలుకుచు వెండియు శయ్యపైఁ బండుకొనిరి.

అమ్మా ! భైరవుఁ డెవ్వఁడు. ఆకథ నాకేమియు నర్థమైనదికాదు. అనిచెప్పిన లీలావతి ముప్పిరిగొను మురిపెముతో నిట్లనియె. ఏమీ! ఆ మూఢునిదుర్ణయ మాయనకుఁ దెలిసినదా ! ఔను. ఆబ్రాహ్మణకుమా రుండు చెప్పియుండునేమో? రేవతీ.! నీమాటవలన నానోములు ఫలించునట్లేయున్నవి. అని దానితోఁ దగురీతి ముచ్చటించెను.

రేవతియుఁ బెద్దతడ వందుండి తదామంత్రణంబువడసి రుక్మిణి యొద్దకరిగి జరగినవృత్తాంత మంతయుఁ జెప్పినది,

రుక్మిణి యామెంజూచుటకు కాలవ్యవధి సహింపక రేవతితోఁ ద న్నామెయొద్ద కప్పుడే తీసికొనిపొమ్మని చెప్పినది. రేవతియు నుద్యా