పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదయంతికథ.

229

నాకు మేనఁ గంపము జనించినది కాని యంతలో ధైర్యము దెచ్చికొని యామెదెసఁ జూచుచు గోడకుఁ జేరఁబడి చూచుచుంటిని

అప్పు డారాచపట్టి యట్టెలేచి పిడికిలిపట్టి రావణునిమీఁదికిహనుమంతుఁడువోలె నామీఁదికి వచ్చుచుండెను. అప్పుడు నేను జేతులుజోడించి నమస్కరించుచు నీశ్లోకము జదివితిని.

శ్లో॥ భూతేంద్ర తవశిష్యోహం గోనర్దీయాభిధానకః
      పూర్వోదిత పరందేహి దేవభూతె నమోనమః॥

దేవభూతే ! అని సంబోధించి నేను బలికినంత నాకాంత నన్నెగా దిగఁజూచి యందె నిలువంబడి నమస్కరించుచు మహాత్మా! నేఁటికి వచ్చితివా ? ఇంతయాలసించితివేల ? నీకొఱకే యింతయట్టహాసము గావింపుచుంటిని. ఇఁక నీ వీరాజ్యముతోఁగూడ నీరాజపుత్రికం బెండ్లియాడి సుఖింపుము. నీకుఁగావించిన యుపకారవిశేషంబునంజేసి నేను గూడఁ బాపవిముక్తుండ నయ్యెదనని పలుకుచు నాబ్రహ్మరాక్షసుఁ డా యంబుజాక్షిని విడిచి యింటిపైకప్పు విడఁదన్ని పెంకులు జలజలరాల నాకసమువంకఁ బోయెను.

అప్పుడు రాజపుత్రిక యొడలెఱుంగక నేలం బడిపోయినది. నేను దలుపులుదీసికొని యీవలకు వచ్చినంత నాప్రాంతమందుఁగాచి చూచు చున్నరాజు నాకడకువచ్చి మహాత్మా ! ఏమిజరిగినది ? అని యడిగిన భూతము వదలినది నీపుత్రికం జూచికొమ్మని పలికితిని.

అందుఁబడియున్న యాయన్నుమిన్నం జూచి దుఃఖముతో దాపునకుఁ బోయి అమ్మా ! మదయంతీ ! అని పిలిచెను. ఆకలికి కన్నులం దెఱచి దాహమిమ్మని సంజ్ఞ చేసినది.

అప్పు డారాజు నన్నుఁ గౌఁగిలించుకొని మహాత్మా ! నీవు మనుష్యమాత్రుఁడవు కావు. నన్నుఁ దరింపఁజేయ నరుదెంచిన భగవంతుఁడవు. కానిచో దారుణక్రియాచరణదక్షుండగు నీబ్రహ్మరాక్షసుని వదలింప