పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/94

ఈ పుట ఆమోదించబడ్డది

(12)

చండిక కథ

97

వడికి జంద్రబింబమును గురుతుగా నిడికొని దక్షిణమునకు మరలి సూర్యోదయసమయమువరకునుం బోయెను. కాని దఱిదొరికినది కాదు.

బుద్ధిశాలియగు కందర్పు డప్పు డాలోచించి అంతనుండి తన జింకను సూర్యున కభిముఖముగా నడిపింపం దొడంగెను. అట్లు నడువ నడువ జాము ప్రొద్దువేళకు భూమి గనంబడినది.

అప్పు డతండు దన్ను బునర్జీవితుంగా దలంచుచు మిక్కిలి యాకలి అగుచుండుటంజేసి యాప్రాంతమం దేవేని ఫలవృక్షములు గనంబడునేమో ఫలములైనం దినవచ్చునను తలంపుతో భూమికి దాపుగా దన కురంగంబున నడిపించుచుండ నొకదండ కుసుమితపల్లవితఫలితతరువిసరమనోహరంబగు నుద్యానవనం బొండు గనంబడినది.

పెన్నిధింగన్న పేదయుంబోలె దానిం జూచి సంతసించుచు నతఁ డందు బ్రవేశించి అక్కురంగంబు నొకమఱుంగున నిడి అందుగల దీర్ఘి ------------------- నముచేసి కడుపునిండ నందలి ఫలరసంబులం గ్రోలి తదీయ వైభవ ------------------- ఈ తోట చుట్టును దిట్టమైన ప్రహరి గలిగియున్నది. వనపాల ----------------యందు జీమకైనం బ్రవేశింప శక్యముకాదు. లేనిచో దమంతన ---------------------యెల్లెడల నుండునా ! ఈ తరుశాఖల వ్రేలంబూన్చిన డోలికావిశేష ---------------తరచుగా నిందు జేడియ లాడుకొనుచుందురని తలంచెద మఱియు ----------------- లిందు బెక్కులు గనంబడుచున్నవి అవి స్త్రీల కర్హంబులగుటచే ------------------- బగుట నిక్కువంబు వివిధకుసుమవాసనా ------------------- లిందు మదీయ మార్గగమనాయనం బవనయించు ---------------------- అరిగెదకాక అని తలంచి యొక చెట్టునీడ గూర్చుండి అందలి వింతలం జూచుచుండెను.

మనోరమ కథ

ఇంతలో నొక చెంతనుండి లతాంతంబులంగోయు కాంతల నెలతనాదంబు వినంబడుటయు నతండదరిపడి యోహో! ఇందామూల వనితలు గ్రీడింపుచుండిరి. ఇందుండిన ప్రమాదము రాకమానదు. ఇదివరకు రెండుగండములు గడిచివచ్చితిని. వేగ నింటికింబోయి సుఖించెద ననితలంచి యాకురంగంబును సవరించుకొని యిది యే దేశమో తెలియదు. స్త్రీజనసంభాషణంబులంబట్టి దేశంబు గురుతుపట్టవచ్చును కావున నీ జింక మీదుగా గొమ్మలమాటునంబోయి యాకొమ్మల మాటలవినియెద దీన బ్రమాదముండదని నిశ్చయించి యాజింక నెక్కి దట్టముగా వ్యాపించియున్న శాఖల సందులనుండి మెల్లగా దప్పించుకొని యాపల్లవపాణులున్న చోటికి...