పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

11

రసికుఁడనరు. రసమనిన నీవూరక యాక్షేపించుచుందుపు. మఱియొకసారి యుపన్యసించెద, కుశంకలు చేయక యాకర్ణింపుము.

రసములు తొమ్మిది.

శ్లో॥ శృంగారహాస్యకరుణారౌద్రవీరభయనకాః
      భీభత్సాద్బుతశాంతాశ్చరసాః పూర్వైర్న పస్మృతాః॥

శ్లో॥ రతిర్హాసశ్చశోకశ్చ క్రోధోత్సాహౌ భయంతథా
      జుగుప్సావిస్మయశమాః స్థాయీభావా నపస్మృతాః॥

శృంగారరసమునకు రతియు, హాస్యమునకు హాసము, కరుణకు శోకము, రౌద్రమునకు కోధము, వీరమున కుత్సాహము, భయానకమునకు భయము, భీభత్సమునకు జుగుప్స, అద్బుతమునకు విస్మయము, శాంతమునకు శమమును క్రమముగా స్థాయిబావము అని చెప్పఁబడు చుస్నవి.

శ్లో॥ విభావై రమభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః
      ఆనీయమానః స్వాదుత్వం స్థాయీభావోరసః స్మృతః॥

విభావము, అనుభావము, సాత్వికము, వ్యభిచారము, వీనిచేఁ దీసికొని రాఁబడిన స్వాదుత్వము స్థాయీభావమనంబడును. దానికే రస మనిపేరు. అందు విభావము ఆలంబనమనియు నుద్దీపన మనియును రెండువిధములు. శృంగారరసమునందు నాయికానాయకులును, రౌద్రరసంబున శత్రువులును, భ్రయానకరసంబున వ్యాఘ్రాదిమృగంబులును, ఆలంబన విభావంబులగుచున్నవి. గుణచేష్టాలంకార తటస్థములని నాలుగు విధముల నుద్దీపనవిభావం జొప్పుచున్నది. రూప యౌవనాదికము గుణము యౌవనంబువలనఁ బుట్టిన హావభావములు చేష్టలు; నూపురాంగదహారాదు లలంకరణములు; మలయానిల చంద్రాదులు తటస్థములు;

శ్లో॥ భ్రూవిక్షేపకటాక్షాదివికారోహృదయస్థితం
      భావంవ్యనక్తి యస్సోయమను భావమితీరితః॥

భ్రూవీక్షేపకటాక్షాదులచే హృదయమందున్నభావమును తెలుపుట అనుభావం బనంబడును.

శ్లో॥ స్తంభప్రళయరోమాంచా స్వేదొవైవర్ణ్యవేవధూ
     అశ్రువైవర్ల్యమిత్యష్టౌ సాత్వికాః పరికీర్తితాః॥

స్తంభప్రళయరోమాంచాదు లెనిమిదియును సాత్వికభావములు. రసమందంతటను నొప్పుచుండుటచే వ్యభిచారములని పేరువడసిన నిర్వేదగ్లానిశంకాది వ్యభిచారములు ముప్పదిమూఁడు. అవి సముద్రతరంగములవలె రసమందు బుట్టుచు నడుగుచుండును. మఱియు ననుకూలుఁడు, శఠుఁడు, దృష్టుడు, దక్షిణుడు అని నాయకులు నాలుగు విధముల నొప్పుదురు.

స్త్రీలలో జాతులు పద్మినీ, హస్తినీ, చిత్తినీ, శంఖినీ, యని సామాన్యముగా నాలుగు విధములు. అందు బ్రతిజాతియందును అవస్థాభేదంబులఁబట్టి వాసక, సజ్జిక