పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/298

ఈ పుట ఆమోదించబడ్డది

భూపాలదేవ మహారాజు కథ

301

దలంచుచు నాగుట్టు తెలియనీయక యతండున్నట్లే రాజ్యాంగముల చక్కపెట్టుచు నాటగోలె రాజ్యతంత్రపరీక్షకై తపంబుఁ బన్ని దేశాటనము చేయదొడఁగితిని.

ఒక సిద్దక్షేత్రంబున నయ్యతి హఠాత్తుగా తారసిల్లుటయు నతని యడుగుదమ్ముల వ్రాలి నృపతివృత్తాంతము చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడయ్యోగి మీరాజు వెఱ్రివాడయి తిరుగుచున్నాడు. నీకుఁ గొన్నిదినములలో కనఁబడును. ఆతండని నీకు తోచినప్పు డానాడు చదివిన పద్యమును జదువుము. అప్పుడు పూర్వస్మృతి కలవాడగునని చెప్పుచు నావలన ప్రతివచనమును బడయకయే యతండవ్వలికిం బోయెను.

అప్పటినుండియు వెఱ్రివాండ్ల నరయుచు కానుకలిప్పింతునను కైతవమున వారిని రప్పించుచుంటిని. మీగ్రామము వచ్చినప్పుడట్లు చేసిన విషయము మీకును జ్ఞాపకము నుండవచ్చును.

ఆరీతి చూచుచుండ దైవనియోగంబున నిందు బొడగంటిని తరువాత కథ మీరెఱింగినదేకదా. చక్రవర్తిగా రెందెందు దిరిగిరో యేమేమి పనులు గావించిరో యాకథ వారు చెప్పవలసినదేకాని నేనెఱుంగనని బలికి యూరకున్నంత విక్రమార్కుండా విషయమును సయితము వినుటకు తమకు మిక్కిలి వేడుకయగుచున్నదని ప్రార్ధించిన నాచక్రవర్తి తనకథ యిట్లని చెప్పదొడంగెను.

ఆదివసంబున నయ్యోగింద్రునితో సంవాదముజేసి యింటికింబోయి కంటికి నిద్రరాక యందలి సత్యాసత్యములగురించి వితర్కించుచున్నంతలో కొంత ప్రొద్దు పోయినతరువాత నేను పరుండియున్న మంచపుదాపున కెవ్వడో యొక వీరపురుషుడు చనుదెంచి యట్టహాసము చేయుచు నాచేయిపట్టుకొని యెక్కడికో వడివడి లాగికొని పోదొడంగెను. అప్పుడు నేనతని చేతిపట్టు వదలించుకొన వలయునని యెంతయో ప్రయత్నము సేసితినికాని శక్యమయినదికాదు. వీటిని కోటను దాటించి క్రమంబున నమ్మహాపురుషుడు నన్ను వాయువేగమున లాగికొనిపోవుచుండ గడియలో ననేక పురనదీపట్టణారణ్యంబులు దాటిపోయినవి. నాకతనివెంట పరుగిడుటకు సామర్థ్య మెట్లు వచ్చినదో నేనెఱుంగను. అదియంతయు నతనిశక్తియేయని యూహింపుచు నరుగుచుంటిని.

అతండట్టి వేగముతో తెల్లవారువరకు నీడ్చుకొనిపోయి వెలుగువచ్చునంత నన్నొకతోట ప్రాంతమున విడిచి యెందేనిం బోయెను పిమ్మటనే నాహా! నామనంబుగల సందియముతీరినది. నన్నీడ్చుకొని వచ్చినవాడె దైవము కాబోలు. నిన్నను యోగిచెప్పిన విషయములన్నియు యథార్ధములని తలంచెను తెలియక నమ్మహాత్మువి తిరస్కరించిన పాతకమే నన్నిట్లుచేసినది. జగంబంతయు దైవాయత్తమయి యున్నదనుమాట సత్యము. సత్యమని నిశ్చయించి యిదిమొదలు దైవాయత్తమనుమాట తప్ప మఱేమియుం బలుకకుండువట్లు వాఙ్నియమము జేసికొని వెర్రివాడనయి యనేక గ్రామంబులు తిరిగితిని! కొన్నిదినములకు నీ యున్మత్తు లిరు