పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/287

ఈ పుట ఆమోదించబడ్డది

290

కాశీమజిలీకథలు - మూడవభాగము

'లలిత ' పరిహాసమాడ ద్వారమూతబూని లోపలకు బోవకున్న మేము చేతులవిదళించి పంపినకధ మరచితివా?

మాలతి - చక్కగా బొంకుచున్నావు. మఱియొకటి జెప్పుము.

కల - తల్పంబునల గూర్చుండినప్పుడు నీమేనంతయు నతండ గందమలంది స్తనములకు రాచినప్పుడు నీవేమిచేసితివో చెప్పుము.

మాలతి - కల్పనాశక్తి నీకు మిక్కుటముగా నున్నది. అదియు నీవే చెప్పుము .

కల - పోనీ నామాటలన్నియును నీకబద్దములుగా దోచుచున్నవి. ఈమధుర వాణి నడిగిచూడుము.

మాల - మథురవాణి! అప్పుడేమి జరిగినది?

మథు - అందులకు నీవు సిగ్గుపడుచుండ నీ లలిత యతనిచేయిబట్టుకొని మా సమక్షమున నీవిట్టిపని జేయకూడదు. మాచెలి సిగ్గుపడుచున్నది. ఆగందము దుడిచి వేయుమని చెప్పిన పురుషరత్నము తెప్పున నట్లు తుడిచన విషయము నేనెఱుంగుదును.

మాల - నీవును గలభాషిణియు మాటలాడికొనిరా యేమి?

మథు - సఖీ! మామాటలసత్యములా? మరియు దాంబూలచర్వణమునందేమి జరిగినదో యీకేసరిక నడిగి తెలిసికొనుము.

మాలతి - కేసరికా! నీ యుపన్యాసముకూడ వినిపింపుము.

కేసరిక - నీవెవ్వరిమాటల నమ్ముకున్న నేమిచేయుదుము. నేను కాదాకప్పురపువీడెము నీచేతను సగము కొరికించి యతనినోట నుంపించితిని. అతనిమొగముపై బన్నీరుజల్లినమాటయు నీకు జ్ఞాపకములేదా?

మాలతి - అయ్యయ్యో? మీరందరు నామీద లేనిపోనిమాటలు మోపుచున్నారేమి. ఇది మాయవలెనున్నది. మీరు చెప్పిన పనులొక్కటియు నేనెఱుంగను. నేను గంపలో గూర్చుండినపుడు చరగొనిపోయినట్లు గంపతో నేనందుండుటయే నిదర్శనముకాదా.

సకురాండ్రు -- అగునగు నామాట విమర్శింపదగినదే ఇప్పుడాయన ఎందున్నవారు ?

మరియొకతె - జామాతృవియోగ చింతాసంతాపిత స్వాంతుండయి కాంతామణితో నేకాంతముగా నంతఃపురమున మంతనము సేయుచున్నవారు.

మాలతి - పెండ్లికాని జామాతగురించి చింతయేమిటికి మీరు పడిన వెఱ్రి యభిప్రాయమే వారిని బాధించుచున్నది కాబోలును. మనమచ్చటికి బోవుదమురండు. అని సఖులతో నిష్క్రమించుచున్నది.

మాలతి సఖులతోఁగూడ తల్లిదండ్రులయొద్దకుబోయి వారితో తమ సంవాద ప్రకారమంతయు చెప్పినవిని మందసౌలుడు సత్కరముగా పుత్రీ! అగునగు