పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/150

ఈ పుట ఆమోదించబడ్డది

[19]

మందారవల్లి కథ

153

యయ్యెలనాగకు ఆనాడు అందఱికన్న ముందు జనశూన్యమగు సభకు బోవుటయే అపజయసూచకమని యెల్లరు దలంచిరి.

అంతకుబూర్వమే యావింత జూచుటకై దేశదేశములనుండి వచ్చిన జనులు సభాభవనము నిండిరి. అంత విజయసమయంబున రామలింగకవి పల్లకీ నెక్కి తలుపులు బిగించుకొని చుట్టును పండితవేషములతో విప్రవటువులు విజయశ్లోకములం జదువుచు బరివేష్టించి రా సుభద్రుండు పల్లకి దండినాని రహస్యముల నెఱిగింపుచుండ మంగళధ్వనులు నింగిముట్ట లవిత్రయనుకాంత అరుగుచున్నదని ప్రజలు చెప్పుకొనుచుండ నాసభాభవనమున కరిగి అంతకుమున్ను తననిమిత్తమై అమర్చి యుంచిన తెరలో బ్రవేశించెను.

శిష్యులందఱు నాతెరముందర శ్రేణిగా నిలువబడిరి. రామలింగకవి విదేశపండితుల నోడించుటకై చిరకాలముక్రిందటనే యెవ్వరికిని దెలియని లిపి వ్రాయించి నూఱుబండ్లపుస్తకములు సంగ్రహించి యుంచెను. అవిఅన్నియు బట్టించుకొనివచ్చి సుభద్రుండు యథాయోగ్యముగా నాశిష్యుల మ్రోలనుంచెను.

రాయలవారు మంత్రిసామాది పరిజనముతో వచ్చి సభ నలంకరించిరి. పెద్దన్న లోనగు పండితులును వారివారి పీఠంబుల గూర్చుండిరి. సభ్యుల సమ్మర్ద ముడుపుటకై రాజభటు లాయాప్రదేశములందు దండధరులై నిలువంబడిరి. ఒక ముహూర్తకాలము సభ అంతయు నిశ్శబ్దముగా నుండుటచే చిత్రితంబో అని వర్ణింపనయ్యెను.

అట్టిసమయంబున ప్రధానమంత్రి లేచి కుడిహస్తమెత్తి యిట్లనియె ఆర్యులారా! ఇప్పుడు కాబోవు విద్యాప్రసంగములో వాది ప్రతివాదులు అనపేక్షితముల భాషింపగూడదు. యుక్తిప్రయుక్తులలో శాస్త్రవిరుద్దముగా ననుధత వ్యతిరేకములు నగువానిని సూచించిరేని పరాజితులుగా నెన్నబడుదురు. అహంకారసూచకములగు వచనములు నపరాధనిర్దిష్టములని యెఱుంగునది. ఎవ్వరెవ్వరితో మాట్లాడుచుందురో వారుగాక యితరు లప్రార్థితులై ముత్తరములీయరాదు. శంకకు దగునుత్తరము రానిచో బై వాక్యమున కుత్తరమియ్యకున్నను దోషములేదు. ఈ నిబంధనలకిరు తెగలవారును బద్దులై యుండవలయునని యిందుమూలముగా దెలియజేయడమైనది.

అనిచెప్పి మంత్రి ముగించినతోడనే మబ్బు వెల్వడిన మెఱుపుతీగియలో యన మందారవల్లి శిష్యురాండ్రు నూర్వురు తెరవెల్వడ మునుపటివలెనే శ్రేణిగా నిలువంబడి మనోజ్ఞమైన గానస్వరములచే సభ్యుల యుల్లంబులు రంజిల్లంజేసిరి. వారి యాకారములును గీతములు, గమనములు, వేషములు, సామాజికులకు మనోవిభ్రాంతి గలుగజేసినవి.

అప్పుడు రామలింగకవి శిష్యులలో మొదటివాడులేచి అగ్రాసనాధిపతిం జూచి దేవా! ఇది రంగముకాదు. పండితసభ. అట్లయినను వీరు జాతిస్వభావమునుబట్టి అభినయమును జూపుచున్నారు. మేము వీరితో బాండిత్యవిషయమై వాదింపవచ్చితిమి గాని వీరియాటపాటల జూచుటకుగాదు. శృంగారలీలావిశేషములచే సభ్యుల