పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

112

కాశీమజిలీకథలు - మూడవభాగము

అతండు తల్పంబున గూరుచుండి వేఱొకయుత్తర మమ్మత్తకాశిని కందిచ్చెను దాని జదువ నిట్లున్నది.

పికవాణీ, పూర్వజన్మంబున నీవొక గోపికవు. కృష్ణావతారంబున గామంబున దృప్తిం బొందక వరంబడిగిన నన్ను వెండియు సురతంబ అభిలషించితివి. అది యుత్తరజన్మంబునం దీర్తు నని అప్పుడు పలికితిని. కామాభిలాషం జేసి వారకాంతవై జన్మించితివి. పూర్వజన్మసంస్కారంబున నా భక్తియు బ్రాప్తించినది. ఆ కోరిక దీర్ప నిప్పుడు చనుదెంచితిని నీయభీష్టములము దీర్చుకొనుము. నీ యిచ్చ వచ్చినన్ని దినంబులు రాత్రులవచ్చి వేకువజామునం బోవుచుండెదను. మాకు భక్తుల కామితముల దీర్చుటకంటె వేరొకపని లేదు గదా?

ఆపత్రికం జదివి అమ్మదవతీ తిలకంబు మేన బులకలుద్గమింప సుగంధమాల్యాను లేపనాదుల అతని నర్చించి పూవుసురటిచే నొక్కింతసేపు వీచి మనంబునం గల భ క్తి విశ్వాసములు దెల్లముగాగ అతని యుల్లము రంజిల్లం జేసినది. కందర్పుండును డెందంబున ముదంబుజెందుచు నా సుందరీరత్నముతో నా రాత్రి అంతయు గందర్పుక్రీడలం దేలి సూర్యోదయము కాకమున్ను ఆ యంత్రమృగం బెక్కి --- యిక్క తుంబోయెను.

ఈరీతి అతండు ప్రతిదినంబునుం బోయి నిశావసానము దనుక తత్కేళీవినోదములం జెలంగుచు దెల్లవారకముంద అరుగుచుండును. అక్కలికియు నిక్కముగా అక్కంసారియే తన భక్తికి మెచ్చి వచ్చుచున్నవాడని సంతసించుచు నా రహస్య మెవ్వరికిని జెప్పవలదని అతండు నుడివియున్న కతంబున దల్లికైన జెప్పక కొన్ని దినములు గడిపినది.

శ్లో॥ స్మితేన భావేనచలజ్జయా భయాపరాఙ్ముఖై రర్థకటాక్షవీక్షణైః
     వచోభిరీర్ష్యాకల హేనలీలయాసమస్తభావైఃఖలుబంధనంస్త్రీయః

యౌవనాదిమదవికారముల బుట్టిన యాకస్మికపు నవ్వుచేతను బాల్యయౌవన సంధియందు బొడమిన శృంగారవిషయికంబై న ప్రధమాంతఃకరణవికారము, భావ మనంబడు దాని చేతను, కుచదోర్మూలాచ్ఛాదనాది మనస్సంకోచకరూపంబై సిగ్గుచేతను, హఠాజ్జనితంబైన భయముచేతను, గ్రేగంటిచూపులచేతను, శుకకోకిల మధురతరమృదులాలాపములచేతను, ప్రణయకలహములచేతను, విభ్రమములచేతను, సాత్వికసంచారభావములచేతను, జితేంద్రియులకు సైతము కాంతలు మోహమును గలుగజేయుదురుగదా.

కందర్పుండు రత్నావతిని వంచింపదలంచి యరిగి విద్యావతి రూపవిభ్రమములచేదానె వంచితుడై పగలెల్ల నెచ్చటనో గడియ యుగముగా గడుపుచు రాత్రులెల్ల దత్క్రీడావిశేషములచే దృటిగా వెళ్ళింపుచు మనోరమ వృత్తాంతములు తన వృత్తాం