ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ పాల కుండల ఆమే నిష్కళంక సౌందర్యవతి కాదనుటకుఁ గారణము లున్నవి. ఆమె శరీర పరిమాణము మధ్యమాకృతికన్నఁ గొం చెము దీర్ఘ మగుట మొదటి కారణము. ఆమె యధరోష్ఠము కొంచెము కిందికి వాలియుండుట రెండవ కారణము. ప్రకృత మామే శరీరచ్ఛాయ బంగారమువలె నుండకుండుట మూఁడవ కారణము, ఆమెశరీర మించుకపొడవైనది. అయినను గరచరణాదులు వట్రువ లయి పరిపూర్ణ సౌష్ఠవమును బొంది యుండెను. వర్షా కాలమందలి వనలత విరివిగా నాకులు విడిచి మిలమిలలాజు ! చుండున టైమె యవయవస్ఫూర్తి 'మెఱుఁగు లీనుచుండెను. అందుచే నామెశరీర మించుక దీర్ఘమైనను యౌవనస్ఫూర్తి చే శోభావంతముగనే యుండెను. ఎవరిని మనము సువర్ణచ్ఛాయలని చెప్పెదమో వారిలో గొందఱు పండు వెన్నెలవంటి మేని కాంతి కలవారుఁ గొంద ఱుదయరాగమువంటి దేహచ్ఛాయ గలవారు నుందురు. ఆమే మేనిచాయ యీ రెంటినిఁ బోలదు. కావున వర్ణము కలదని చెప్పలేము. కాని మనోహరత్వమం దామె తనుచ్ఛాయ యేమాత్రము తీసిపోదు. ఆమె శ్యామవర్ణ , కాని మనము కృష్ణుఁడు శ్యామసుందరుఁడనియు, కాళిక శ్యామాంగి యనియుఁ జెప్పెదము. ఆమె యట్టి శ్యామవర్ణ కాదు. ఆమేది తప కాంచనమువంటి జుఁగుచామన చాయ, నవో నామె -