ఈ పుటను అచ్చుదిద్దలేదు

క పాల కుండల ప్రశమ ఖండము అది మాఘమాసము. ఒక నాఁటి వేకువజామున యాత్రికుల నావ యొకటి గంగాసాగర సంగమ ప్రదేశమునుండి మరలి వచ్చుచుండెను. ఆ కాలమున పోర్చుగీసులు నితర దేశీయులును బడవలను గొల్లగొట్టుచుండుటచే వారి భయమున యూత్రికులు తమ తమ నావలను గుంపుగాఁ జేర్చీకొని రాక పోకలు చేయు చుండిరి. కొని యీనావయ దున్న వారి కితరుల సాయ మేమియు లేదు. కారణ మేమనఁ దెల్ల వాజుజామున దిగం తములందుఁ గారుమజ్బులు భయంకరముగాఁ గ్రమ్ముకొను టచే నావికులు దిక్కులు నిరూపింప లేక "కాశ్రేణినుండి విడివడి చాలదూరము కొట్టు కొనిపోయిరి. ఆసమయమున నెవ్వ రే దిక్కునఁ బోవుచుండిరో వారి కెంతమాత్రము తెలి యుట లేదు. నావయం దున్న వారిలో జలమంది నిదురించు చుండిరి. వృద్ధుఁ డొకఁడును యువకుఁ డొకఁడును మాత్రము మేలుకొని యుండిరి. ముదుసలి పడుచువానితో సంభాషిం చుచుఁ గొంచె మాఁగి ప్రధాన నావికునితో "ఓయీ! నేఁడు .' మన మెంతదూరము పోంగలము ?" అనెను. వాఁ డటునిటుఁ దిరుగుచు “ఏమో నిశ్చయముగాఁ జెప్ప లేను ! " అని బదులు పలి కెను. 2