ఈ పుట ఆమోదించబడ్డది

కరట: పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీ యేవే, ఉద్యానాల్లో వుండుకున్నటువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహాకవుల నాటకాల్లో ఆష్లాగే జరిగినట్లు రాశారండి.

రామ: మరెవళ్ళతో మాట్లాడినా తప్పులేదు గాని, హెడ్డుకనిష్టీబు మాత్రం మాట్లాడవద్దని బుద్ధి చప్పండి. మీరు తండ్రిలాంటి వారుగదా?

కరట: ప్చు! అంత అదృష్టవాఁ అంటి! అట్లాంటి పిల్లే నాకువుంటే, మూడు నాలుగు వేలకమ్ముకుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసివుందును. దీన్నయినా నాలుగు దిక్కులా అమ్మజూపితే రెండు మూడు వేలు యిదివరకే చేతులో పడివుండునండి. మేనరికం చెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీ దురవస్థ మాకొచ్చింది. అంచాతనే యింట్లో చప్పకుండా యీ పిల్లని వెంటతీసుకొచ్చి యీ దేశంలో పెళ్ళికి చూపుతున్నాను.

రామ: నా సహాయ లోపం వుండబోదు!

కరట: ఐతే కార్యవఁయిందే!

రామ: యేదీ పిల్లా యిలారా, చెయి చూపించూ!

(శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును)

కరట: చూపించమ్మా, భయంలెచ్చూపించు (కరటకశాస్తుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోయును. రామప్పంతులు చెయ్యి పట్టుకుని అరిచెయ్యి చూచుచుండును. శిష్యుడు చెయ్యిలాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం, కాకితం పట్టుకుని రామప్పంతులు వెనక నిలుచుండును.)

రామ: ఆహా! యెం ధనరేఖా! సంతానయోగ్యత బాగావుంది.

మధుర: మీరు చేపట్టింతరువాత, అందుకు లోపం వుంటుందా?

(సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖం మీద పోసి ఛర్రున వెళ్ళిపోవును.)

3-వ స్థలము, కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి యిల్లు.

(వీధిగుమ్మం యదట గిరీశంనిలిచి సన్ననిగొంతుకతో పాడును.)

"కాముని విరిశరములబారికి నే,

నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?"

వీడి తస్సా గొయ్యా, వీడిబాణాలు పువ్వులటోయి? ఆమాట యవడునమ్ముతాడు, వెర్రికుట్టె యెవడైనా నమ్మాలిగాని? అనుభవ వేద్యవైఁన దీని నిజం యేవిఁటంటే - మంచిపదునుబట్టిన లోహం మొనకి, డయమండ్‌ పొయంట్‌ వేసి, పోయజన్‌లో ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే, పైకి గాయం కనపడదుగాని పోలీసువాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి. యీ విడో