ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౬

ఈ విధమైన ధృస్టి వూర్ల పేర్ల మీద ఇంతవరకూ లేక పోవడం వల్లనే నాటి సేకరణ నేడు భగీరథ ప్రయత్నం గా తయారయింది.

 ఊర్ల పేర్ల సేకరణ ఒక ఎత్తైయితే వాటి ఎడిటింగ్ మరొక ఎత్తు . అది జరిగాక రచనా ప్రణాళిక రూపొందించుకోవడం మరొక ఎత్తు. కదప ఊర్ల పేర్ల్ల సేకరణ రెండేళ్ళు పడితే , ఎడిటింగ్ కి ఏడాది పట్టింది. రచనా ప్రణాళిక రూపొందించుకోవడాని కి , గ్రంధ రచన చేయడాని కి మరో మూడేళ్ళు పట్టింది.1974 సెప్టెంబరు కు గాని గ్రంధ రచన పూర్తి కాలేదు. English place Name Society (London) American Name Society ,(Potsdam, U.S.A), International Onomstic  Institute (Leuven, Belgium) ల తోనూ, పాశ్చ్యత్య స్తలనామ వేత్తలతో ఉత్తర ప్రత్యుత్తారలు జరిపిన తరువాత గానీ  వారి నుంచీ స్తలనామ  పరిశోధనాపద్దతులుల్ తెలుసుకొన్న తరువాత గాని, పూనా దక్కన్ కళాశాల గ్రంధాలయం , మద్రాసు విశ్వవిద్యాలయం గ్రంధాలయం , కెనెమెరా గ్రంధాలయం , మైసూరు ఎపిగ్రఫీ డిపార్టుమెంత్  -  వీటిలో ఈ పరిశోధనకు సంబందించిన వివరాలు, గ్రంధాలు ,  పత్రికలు గాలించిన తరువాత గానీ , ఈ నాటి ఊర్ల పేద్లు కు శాసనాలలో ఉందే వూర్ల  పేర్లేవో సేకరించిన తరువాత గానీ , ఊర్ల పేర్ల విజౢాన సర్వస్వాలైన వేలాది పుటల మెకంజీ కైఫీయుతు ల్లోని వూర్ల పేర్ల పుట్టుపూర్వోత్తరాలను , స్థల పురాణాదు లనూ ప్రొ. క్కేల్కర్ , డా. బూదరాజు రాధాక్రుష్ణ ,చేకూరి రామారావు , ప్రొ. దోణప్ప వంటి భాషావిజౢానులతో సుముఖం లో చర్చించడానికి ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి అవకాశాలు కలించిన తరవాత గానీ, , అన్నింటికీ మించి అడుగడుగునా సేకరించిన విషయాన్ని పరిశోధనలో శాస్త్రీయం గా ఉపయోగించు కోవడం లో పరమచోదక శక్తిగా ఆచార్య జి. ఎన్. రెడ్డి గారు నిల్చిన తర్వాత గానీ ఒక రచనా ప్రణాళిక రూపొందించు కోవడం జరకలేదు; ఈ విషయం మీద ఒక స్తూలమైన శాస్త్రీయావగాహన ఏర్పరుచు కోవడం సాధ్యం కాలేదు. 

అప్పటికి తెలిసివచ్చింది . ఏ పేర్లయినా ఆకాశం నించి హఠాత్తుగా వూడి పడ్డవి కావనీ, మనుష్యుల పేర్లయినా, స్తలాల పేర్లయినా, ఊర్ల పేర్లయినా, వేల్ వందల సంవత్సరాల వివిధ సామాజిక స్థిగతులకూ ,అవసరాలకూ, అనుగుణం గా ఏర్పడినవనీ, ఒక భాష మాట్ల్లాడే ప్రాంతం లో ని భౌగోళిక , నైసర్గిక , పరిస్థితులనూ, ప్రజల మానసిక ప్రవ్రుత్తులనూ, భాషావ్యవస్త్థనూ నాగరికతనూ, సాంఘిక, రాజకీయ చరిత్రలనూ, సంస్కుృతినీ పేర్లు ప్రతిబింబిస్థాయనీ , వాటి శబ్దార్ద పరిశీలన ఒక శాస్త్రమనీ.