ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౫

గ్రామాల లిస్టులు సంపాదించి ,వాటికి మజరా గ్రామాలు కూడా ఉన్నాయని తెలుసుకొని వాటి సేకరణకు దిగే వేళ కు ఒక జిల్లాలోని ఊర్ల పేర్లను నిర్ధుష్టం గా, సమగ్రంగా సేకరించడమే బ్రహ్మప్రళయమని తెలిసింది. కడప జిల్లాకు పరిమితం చేసుకోమని ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారు ఈ దశ లో సలహా యిచ్చినారు.

కడప జిల్లా ఊర్ల పేర్ల సేకరణ యజ్నం లో ఎదురైన సమస్యలు వొకటీ రెండూ కావు. (వివరాలకు చూడండి పు. 12.14 .గ్రామనామ సేకరణ : కొన్ని సమస్యలు) . దురదృష్టం కొద్దీ బ్రిటిష్ పరిపాలనా పద్దతులే ఇంకా కొనసాగుతూ ఉండడం వలన సర్వవ్యహారాలకు ప్రమాణం రెవెన్యూ గ్రామమే. ఒక రెవెన్యూ గ్రామం నేడు నిర్మాన్యుషమైనా (బేచరాకు); 50 లోపు జనాభామాత్రమే కలిగి ఉన్నా , వాటి క్రింద వుండే మజరా గ్రామాల కంటే సర్వవిధాల చిన్నవైన , పరి పాలనా వ్యవస్థ లో రెవెన్యూ గ్రామాలకు ప్రతిపత్తి ఉంది.; మజరా గ్రామాలకు అస్తిత్వం లేదు. నిజానికి గణాంక వివరాల దృష్త్యా ప్రతి ఊరూ ముఖ్యమైనదని గుర్తించినప్పుడే , నైసర్గిక స్తితిగతులూ , పౌర వ్యవహారాలూ , విద్యావైద్య సాంసృతిక విశేషాలు , వ్యాపార వాణిజ్య పారిశ్రామిక బేంకింగ్ సౌకర్యాలు , మతకుల వృత్తి విభజనకు సంభదించిన జనాభా వివారాలూ , అభివృద్ది కార్యక్రమాలు . వీటి విషయం లో పతిఊరునూ పరిగణ లోనికి తీసుకోవలసిన అవసరం గుర్తించినప్పుడే , ఊర్ల పేర్లను వేటినీ వదలకుండా ప్రాంతీయ భాషలో ప్రాంతీయోచ్చారణ అనుగుణం గా రాసి, ఇంగ్లీషు లో లేఖన చిహ్నాలతో గుర్తించి ఊర్ల పేర్ల పట్టికలు ప్రతీ జిల్లాకు తయారుచేసి నప్పుడే , ఊర్ల పేర్లను పరిపాలనలోనూ , పరిశోధనలోనూ ఒక గౌరవం ఏర్పడుతుంది. ఒక జిల్లాలోని రెవెన్యూ గ్రామాలకు వాటి క్రింద ఉండే మజరా గ్రామాలనూ నిర్ధుష్టం గా, సమగ్రం గా సేకరించి ప్రచురించడఒ , పరిపాలనా నిర్వహణకూ, ప్రతి గ్రామాభివృధ్ధి పర్యవేక్షణకూ , గ్రామ సామాజిక ఆర్ధికపరమైన సర్వేలకూ, (Village Socio - Economic Surveys) ఎంత సహాయమో చెప్పలేము. ఉదాహరణకు షెడ్యూలు కులాలూ, తెగలూ , నివసించే మాలవాడలూ, మాదిగ పల్లెలూ , కురవపల్లెలూ , ఎరికెల బిడాలు,నుగాలీ పల్లెలూ ఏ ఏ రెవెన్యూ గ్రామాలకు ఎన్నెన్ని ఉన్నాయో , ఒక్కొక్క తాలూకా లో ఎన్నెన్ని ఎన్నెన్ని ఉన్నాయో , మొత్తం జిల్లాలో ఎన్నెన్ని ఉన్నాయో , అవి ఏవేవో , స్పష్టంగా వాటికి చెందిన అధికారికమైన రికార్డు ఉన్నప్పుడే వాటి అభివృధ్ధి పర్యవేక్షణ సులభ తరమవుతుంది. వాటి సామాజికార్ధికపరమైన సర్వేలు నిర్దుష్టం గా, సమగ్రం గా జరుగుతాయి. ప్రభుత్వ విధానాల్ అమలు సమర్ధవందం గా ఊరూరా జరుగుతుంది.