ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౧


యితే మరో లక్ష కావచ్చు. పరిశోధనాత్మక పరిశీలనకు ఇంతటి విస్తార మైన సామగ్రి ఉన్నప్పుడు పరిశోధక విద్యార్ధులూ, పండితులూ, స్థలనామ పరిశీలనకు పూనుకోక పోవడం పెద్ద కొరత. ఇది పరిసోధానాంశాల పట్ల మన కున్న అవగాహన లొ ఒక లోపాన్ని చాటుతున్నది. ఇట్టి లోపాన్ని తెలుగులో కొంత వరకూ తీర్చడానికి ప్రధమ ప్రయత్నం చేసిన పరిశోధకుడు విశ్వనాధ రెడ్డి . కడప జిల్లా గ్రామ నామాలకు సంభందించిన ఈ పరిశోధక గ్రంధం లో ప్రధానాం శాలు రెండు. ఒకటి కడప జిల్లా గ్రామనామాలను వివిధ ధృక్కొణాల నుండి పరిశీలించడం , వివరించడం. రెండు గ్రామనామ పరిశీలనకు అనువైనటువంటి ఒక శాస్త్రీయ చట్టాన్ని రూపొందించడం . విశ్వనాధ రెడ్డి శాస్త్రీయంగా రూపొందించిన ఈ చట్రం ఒక్కొక్క జిల్లాకు సంబందించిన గ్రామ గ్రామ నామ పరిశీలనకు మార్గదర్శి కాగలదని నా విశ్వాశం. తెలుగు దేశం లోని అన్ని జిల్లాల గ్రామ నామాల సమగ్ర పరిశీలనకు ఈ ప్రచురణ దోహదకారి కాగలదని కూడా నా నమ్మకం .

తెలుగునాదు లోని స్థలనామాలను సమగ్రం గా సేకరించి పరిశీలించడం ఒకటి రెండెళ్ళలో జరిగే పని కాదు. అనేకుల కృషి తో దీర్ఘకాలం గా జరగవలసిన కార్య మిది. ఇట్టి కృషి కి ప్రాతిపదికగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ రాయల సీమ జిల్లాల గ్రామనామ పరిశీలనకు పరిమితం చేసుకున్న ఒక ప్రణాళికను యు.జి.సి. సహాయం తో నిర్వహిం చడాని కి ప్రయత్నిస్తున్నది. భారతీయ స్థలనామ సంఘ స్తాపనకూ, ఒక ప్రత్యేక పత్రికా నిర్వహణకూ కూడా ప్రయాత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఫలించి కార్య రూపాన్ని పొందినప్పుడు తెలుగు గ్రామనామాల పరిశీలనను త్వరితగతిలో ముందుకు సాగగలదని ఆశించవచ్చు.

జి . ఎన్. రెడ్డి.

ఆంధ్ర శాఖాధ్యక్షులు

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.

తిరుపతి

14.10.1976