పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రాజపుత్రుఁడు - దేవతలనిమిషులని వ్రాయఁబడియున్నదిగదా? నీవురంభవైతే నీకంటిఱెప్పలట్లు వాలుచున్న వేమి?

పద్మసేన - సరిసరి ఇదియా! మిశంక పురాణవచనములన్నియు సత్యములనుకొనుచుంటిరా ! పూర్వకాలములో నట్లుండునవి చిరకాలమగుట బరువెక్కి యిప్పుడు ఱెప్పలువాలుచున్నవి.

రాజపుత్రుఁడు - మంచిసమాధానమే. కానిమ్ము. నాదేహము వెనుకటిదేనా మారినదియా?

పద్మసేన — అదిమీకేతెలియగలదు చూచికొనుఁడు?

రాజపుత్రుఁడు – (చూచికొని) పూర్వదేహమె! నేనీ దేహముతోనే స్వర్గము జేరితినా?

పద్మసేన - అవును, అమ్మహర్షిప్రసాదమువలన.

రాజపుత్రుఁడు - నేను దిరుగామాదేశమునకుఁబోవుదునా?

పద్మసేన - అది యసంభవము నాకమునకరిగినవారు తిరుగా స్వదేశమునకరుగుటయెట్లు?

రాజపుత్రుఁడు - నేనిక్కడ నేమిచేయుచుండవలయును?

పద్మసేన — మీరుపురాణములు చదివియుందురు. స్వర్గలోక వాసు లేమిచేయుచుందురో తెలియదా మీరునదియే?

రాజపుత్రు -- మదీయభుజపరాక్రమము తేటపడఁ బ్రత్యర్థులతోఁ బోరాడవలయు నిందుమహావీరు లెవ్వరైన నున్న రా!

పద్మ - కావలసినంతమంది మహావీరులున్నారు. ఇందున్నవారందరుశూరులే. మీభుజకండూతివ దల్పఁగలరు. అని పద్మసేనవీరవర్మతో నర్మాలాపము లాడుచున్న సమయంబునఁ బరిచారిక తలుపు దగ్గిరకువచ్చి రాజువుత్రీ! నీతో మాట్లాడుటకై అమ్మగారు వచ్చు చున్నారఁట తలుపువేసి యీవలకు రా అని సంజ్ఞచేయుటయు నదరిపడి యమ్మదపతి యిదిగో యిప్పుడే వచ్చెద నిందుండుఁడు. అని