పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మసేనకథ.

81

యంత్రశిలాఫలకమన నేమి? అది యెక్కడనున్నది. దానిలో వీఁడెట్లు పడెను. దానివృత్తాంత మెఱుంగుదువా యనియడిగిన సఖురాలిట్లనియె.

ముదితా ! అదియొక బోనువంటి యంత్రము. భూలోకములోఁ జిత్రకూటమను నగముగలదఁట అలంబసుండను రాక్షసుండు ముని వేషధారియై యాగిరినాశ్రయించుకొనియుండును. ఆకొండశిఖరమున సుందరంబగు కందరమొకటిగలదు.ఆగుహలోనుండి మనలోకమువఱకు సొరంగము త్రవ్వించిరి. అలంబసుం డెఱుఁగనిమనుష్యుల నాగరిశిఖర మెక్కించిగుహావిశేషంబులం జూపునెపంబున శిష్యునిచేనాగర్తంబునం బఁడవేయించును. అందుఁబడినవారు సగము ప్రాణముతో నీలోకము జేరుదురు. ఆ దేహముశకలములుగాకుండమీతండ్రియందొక శిలాఫలక మమరించి దానిపై నిసుకపరుపు వైపించి యందుఁబడిన వెంటనే బడియతోఁజంపించి యామాంసము తెప్పించుకొని తినుచుండును. ఆయంత్రము మయునిచే నమరింపంబడినది. అందునల్లపూసవైచినను జారివచ్చి యీయిసుగపఱుపుపయింబడును. అని యీకథ నాకొకప్పుడు మాతల్లి చెప్పినది పాపమీపురుషుఁ డాలయంబసుని మోసమెఱుంగక యాసొరంగములోఁ బడి వీనిచేఁజిక్కెను. వీనియాకారముజూడ గొప్పవంశమువాఁడుంబలెఁగనంబడుచున్నాడు. వీనిదేహమును నరాంతకునిభార్యకు గబళమగునట్లు విధి విధించెనుగాఁబోలు ! నెట్లుతప్పునని పలికిన విని రాజపుత్రిక యిట్లనియె.

అట్లుకాదు దైవసంకల్పము వేరొకరీతినుండఁబట్టియే మనకంటఁ బడియెను. వినుము వీనిమన యింటికిఁ దీసికొనిపోయి బ్రతికింతము. వీని వృత్తాంతమువిని కర్తవ్యమాలోచింతము వీనిసౌందర్యము నాడెందము లాగుచున్నది వీడు బ్రతికిన నాపురాకృతము ఫలించినదనుకొనుము. అని యేమేమో పలికి దాని నొప్పించినది.

పిమ్మటఁ బరిచారిక కుంభునితో నోరీ ! రాజుగారు దినవలసిన