పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/93

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లంబోదరిచేఁతిక్రింది భృత్యుఁడ నాపేరు కుంభుండందురు నే నాలంబోదరిపంపునం బోవుచుంటినని గద్గదస్వరముతోఁ బలికిన నక్కలికి గంపలోనిదేమో చూపి పొమ్మనుటయు వాఁ డాగంపను మెల్లగా నేలకుదింపి పైమూత దీసి నంత.

సీ. ఆజాను దీర్ఘబాహాదండయుగళంబు
             సురుచిరకంబు సుందరగళంబు
    తొగలఱేని బెడంగు దెగడునెమ్మొగమురు
             ద్యుతిఁ గల్వరేకులదొరయు కనులు
    పిడికెడునడుము నొత్తెడు పళిత్రితయంబు
             రమ్య ప్రణాంకితోరస్థలంబు
    మేలిమిబంగారు డాలునేలఁగఁజాలు
             నొడలుతీరై యొప్పుతొడలు గలిగి

గీ. యవయవంబుల గుదియించి యణఁచి గంప
    లోన నిమిడించి కట్టినగాని కాంతి
    దొరగకందొంటి ప్రాణంబుతోవసించి
    యున్న రాసుతుఁగాంచి రక్కన్నె లపుడు.

తటాలున బండిదిగనుఱికి రాజపుత్రిక వాని కళేబరము పరిశీలించి చూచి తలయూచుచుఁ జెలీ! వీఁ డెవ్వఁడో యీలోకమువాఁడు కాడు అయ్యో! పాపము వీనిమేన నొక్క ప్రాణముమాత్రమే యున్నట్లు తోచుచున్నది. కటకటా ! వీనినిట్లు తట్టలోఁ నొక్కిపెట్టితివేమిరా! వీఁ డెవ్వఁడు? ఎందుఁ దీసికొనిపోవు చుంటివి. నిజము చెప్పుము లేకున్న నిన్ను దండింపఁజేయుదునని యదలించి యడిగిన వాఁడిట్లనియె.

తల్లీ ! వీఁ డెవ్వడో నేనెఱుంగ నేఁడు యంత్రశిలాఫలకంబునం బడియెను లంబోదరిపంపున నరాంతకునింటికిఁదీసికొనిపోవుచున్నానని యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆమాటవిని రాజపుత్రిక సఖీ !