పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మసేనకథ.

79

పోయి యప్పగించిరమ్ము. నాకు మాటదక్కగలదు వారిల్లా తోటలో నున్నదని యుపదేశించిన నించుక సంశయించుచు వాఁడిట్లనియె.

దేవీ! వంటవాండ్రు దీనికొఱకు వేచియుండి తీసికొనిపోకున్న రాజుగారి కెఱింగింపరా! నేఁడు పడినకళేబరమేమైనదని యడిగిన నేమిచెప్పవలయును? ఏలిక వలన మాటరాదా? అనియడిగిన నారక్కసి సరిసరి. ఇదియా నీశంక మనమిరువురము గలిసిన నీరహస్యమెవ్వరికిఁ దెలియును? నేఁడేకళేబరము శిలాయంత్రమునఁ బడలేదని చెప్పుదము. వరుసతప్పక నిత్యము పడుచున్నదా యేమి? అనుటయు వాఁడుదాని కనుచరుఁడగుట సప్పనికంగీకరించి తత్కళేబరముజిదియఁ గొట్టక మెల్లగానొకతట్టలోనికెక్కించి మూతవైచి నెత్తిపై బెట్టికొని యాతోట దెసగాఁ బోవుచుండెను.

__________

పద్మసేనకథ.

అప్పు డప్పురవరప్రభువగు వజ్రకంఠుఁడను రాక్షసరాజు కూఁతురు పద్మసేనయను చిన్నది ద్విజటయను చెలికతైయతోడ నశ్వశకటమెక్కి పూఁదోటకుఁబోయి మరలి వచ్చుచు దైవవశమున నాకుంభున కెదురు పడినది.

కుంభుం డాబండి రాజపుత్రికదని యెఱింగి వెఱచుచు మఱిగిపోవలయునని పెడతెరువున మఱలెను. అవ్విధమరసి రాజపుత్రిక యనుమానముతో వానిం దాపునకు రప్పించి నీ వెవ్వఁడవు ! ఆ గంపలో నేమియున్నది? నీమొగంబు జూడ నేదియో యెత్తికొనిపోవుచున్నట్లు కనంబడుచుంటివి. నిజము సెప్పుమని యడిగినవాఁడు గడ గడ వడంకుచు నిట్లయె.

తల్లీ ! నేను దేవరదాసుఁడ. శిలాయంత్రమును గాపాడుచున్న