పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/89

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వసించితిమి మాబలమువలన మీయాశ్రమమునకుఁ జెరుపుగలిగినదని మీశిష్యుండు సెప్పుచున్నాడు మాతప్పుమన్నించి మాయెడఁ బ్రసన్నులై పోవుట కనుజ్జయిండని ప్రార్ధించుటయు గన్నులెత్తి చూచి యాతపోధనసత్తముండు హస్తసంజ్ఞచేఁ గూర్చుండుమని నియమించి మఱికొంతసేపునకు జపముసాలించి యక్షమాలికచెవికిఁ దగిలించి యిట్లనియె.

ఓహో! నీవు తాళధ్వజుని కుమారుండవా! సంతోషము మీయుదంత మెఱుగఁక మాశిష్యుండు మిమ్మదలించెను. పోనిండు అది యొకశుభమే నేఁడిందు మాయతిధిపూజనంగీకరించి ఱేపుపోవుదురు గాక. అదియేమదీయతపోవనశైలముఅందలి విశేషములపూర్వములు తద్గుహాంతరమున నిలిచిచూచిన దిక్పతులనగరములుగనంబడును. మఱియుననేక వినోదములున్నవి. నేఁడువానిం జూడవచ్చును. నిలువుడఁని పలికిన మనమున నిష్టములేకున్నను నతని కేమికోపమువచ్చునోయని యమ్మాటల కంగీకరించి నేటికిఁబయనంబు సాగింపవలదు. ఆశ్రమ భంగంబుగాకుండ నందే యుండవలయు జాగ్రతయని తమ్మునికివార్త నంపి వీరవర్మతనకాశైల విశేషంబుఁ జూపింపుడని ప్రార్థించుటయునమ్ముని యందొక శిష్యునిజీరి యోరీ! యీతండు సామాన్యమానవుండు కాడుసుమీ! మహావీరుఁడు జాగ్రతగాఁ దీసికొనిపోయి గుహావిశేషంబుల జూపింపుము మర్యాదదాటకుండఁబ్రాణముల రక్షించుకొనిరమ్ము పొమ్ము. అనియెఱింగించి శిష్యుని వాని వెంటనంపెను. అయ్యతిశిష్యుండారాజకుమారుని వెంటనిడుకొని యందున్న సోపాన మార్గంబున నప్పర్వతమెక్కించి యశేషతరులతావిశేషంబులం జూపుచు నానావిధ ప్రసూనవాసనలు నాసాపర్వంబుగావింపఁ దత్తత్ప్రదేశములు త్రిప్పి త్రిప్పి క్రమంబున శిఖరారోహణంబు గావింపఁ జేసెను.

అందొక గుహాముఖంబు గోపురద్వారమువలె భూరికవాట