పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరవర్మకథ.

75

సీ. త్రుంచివైచెనదే భ్రమించి కాల్బలము మం
             జుల ఫలప్రనవప్రసూనతతులఁ
    ద్రొక్కివైచినవవే తురగముల్ ఖురపుటీ
             కోటీహతులఁ బుష్పవాటికలను
    విరచివైచినవవే వేదండములు కరాం
             తములెత్తి ఛాయాప్రధానతరుల
    జెఱచివైచినవవేపఱచి తేఱులునేమి
             ధారాగతులను గేదారములను

గీ. మీరలెవ్వారలధిక కాంతారమధ్య
    గతతపోవనభంగంబుఁ గలుగఁజేయ
    వచ్చితి రెఱుంగరో మునీశ్వరులమహిమఁ
    గన్ను లెఱ్ఱైనబసుమంబు గాకయుండ్రె.

అని యుచ్చస్వరంబునఁ బలుకుచు నచ్చటికొక తాపసకుమారుండరుదెంచుటయు వానింగాంచి వీరవర్మ నమాస్కారముగావించి స్వామీ! మీరెవ్వనిశిష్యులు ఇది తపోవనంబని దెలియక నిందుసేనలతో విడిసితిమి క్షమింపుఁడు మేమరుగుచున్నారమనిన నామునిశిష్యుఁడు మీరిప్పుడు పోవలదు. మాగురువుగారనతిదూరములోనున్నారు. అమ్మహాత్మునికడకువచ్చి తప్పుజెప్పుకొని సెలవడిగిపొండు. లేకున్న మీకు ముప్పురాఁగలదని పలికినవినియనుమోదించి వీరవర్మవినీత వేషముతో నాశిష్యునివెంట నాయత్యాశ్రమమున కరిగెను. రుద్రాక్షమాలికా విరాజితవక్షుండు భసితావలేపితసకలాంగుఁడు జటామకుటవిరాజితుండునగు నాయోగింగాంచి వెరగందుచు వీరవర్మ తత్పాదములమ్రోల సాష్టాంగమెఱగి మహాత్మా! నేను తాళధ్వజుండును క్షత్రియునిపుత్రుడ నాపేరు వీరవర్మయండ్రు సుధన్వుఁడను తమ్మునితోఁగూడ దిగ్విజయముసేసి యింటికరుగుచున్నవాఁడను తెలియక నేఁడు మీవంబున