పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్త్రీజన్మము.

71

క. మఱచెను బ్రహ్మజ్ఞానము
    మఱచెను యోగప్రసక్తి మతిఁదాను మునీ
    శ్వరుఁడగుట మఱచె నృపతిని
    మఱిఁగి రతుల యువతి మాయమఱుఁగె ట్టిదయో!

అట్లు కొన్నివత్సరంబులు గడిచినంత నక్కాంతామణికి దౌహృదలక్షణంబులు పొడసూపుటయుఁ నాభూపతి యపరిమితానందంబుఁజెంది గర్భసంస్కారములఁ గావింపఁజేసి మహోత్సవములతోఁ బుత్రోదయ మభిలషించుచున్నంత,

క. అభినవమదనుండో యన
   శుభలక్షణ లక్ష్మితుండు శూరాంకుండై
   ప్రభవించె సుతుఁడు సుదతికి
   శుభలగ్నమునందు భూభుజుఁడు గనిమురియన్.

ఆరాజు పాఱులకపారముగా షోడశమహాదానములు గావించి జాత కర్మానంతరము విప్రప్రేరితుఁడై పుత్రునకు వీరవర్మయను నామకరణముజేసెను. మఱియు నాశిశువుం బెనుప దాసీసహస్రములు గలిగియున్నను దదర్పితముసేయక తామేనుతపోషణలాలసులై తదీయ గమనహాసవచనరచన క్రీడావినోదములు మోదం బొనరింపుచుండ రెండుసంవత్సరములు తృటిగా వెళ్ళించిరి.

ద్వితీయవత్సరాంతమునఁ గ్రమ్మర నయ్యువతి గర్భవతియై పదవమాసంబునఁ బుత్రరత్నమునే కనినది. సర్వలక్షణలక్షితుండగు నా బాలునకు భూపాలుండు సుధన్వుండని పేరు పెట్టెను. తిరుగా మూడేండ్లకు నారాచపట్టి యఱియొకముద్దులపట్టింగాంచినది. వానికి రాగవర్ధనుఁడని పేరుపెట్టెను. ఈరీతి నా నారీరత్నము మూఁడేండ్లకొకపుత్రుని వరుస క్రమంబున నిరువదిమంది పుత్రులంగనినది వారందరు ససమానరూపరేఖావిలాసంబుల నొప్పియు సమానరూపరేఖావిలాసములతో