పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కాశీమజిలీకథలు - పదియవభాగము.

క. తాళధ్వజుఁడను వాడన్
   గాళీభక్తుండఁ బ్రధితకన్యాకుజ్జా
   ఖ్యా లలితనగరపతినై
   పాలింతున్ భూరిభూమిభాగంబెలమిన్.

ఉ. పెండిలియాడలేదు తగుభీతమృగాయతనేత్ర లభ్యగా
    కుండుటఁజేసి యీసరికి నోసరసీరుహనేత్ర! త్వద్వయో
    మండితచారురూప లసమానవిలాసములా ప్రసూనకో
    దండ నిశాత సాయకవితానములై ననునేచె నిత్తఱిన్.

కృశోదరీ! నీవునన్నుఁ బెండ్లియాడితివేని త్రిభువనంబుల నన్నుఁబోలు భాగ్యవంతుఁడు లేడుగదా నాకుఁగల సకలసౌభాగ్యంబులు నీయధీంబు గావించి నీ చెప్పినట్లు నడుచువాఁడ న న్నను గ్రహింపుమని పలికిన విని యక్కలికి కలికిచూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు దత్సౌందర్యాతి శయంబున కచ్చెరువందుచు మల్లన నిట్లనియె.

చ. సలలితరూప నుత్తసుమచాప! మదీయచరిత్రయేమియున్
    తెలియదునాకు నీవనికి నేనెటువచ్చితినో యెఱుంగ మ
    మత్కులమును దల్లిదండ్రులును గోప్తలు నెవ్వరొ? యేమిచేయఁగా
    వలయునొ తోచకున్నయది భావమునందలపోసిచూడఁగన్.

అంతయు నాకగమ్యగోచరముగా నున్నది. నిరాధారనై చికీర్షితముల గుఱించియే వితర్కించుచుంటి నీవు ధర్మజ్ఞుఁడవు సత్యసంధుండవని తోచుచున్నది. నా కెవ్వరు దిక్కు లేరు. నేనీ యధీననగుదు బౌలకుండవై యేలికొనుము అనిపలుకుటయు నప్పలుకులమృతము పలుకులవలెఁ జెవులకుసోకి కుతుకపరుప మదనాతురుండై యనతిదూరములో నున్న భృత్యులచే ముక్తాజాలవిభూషితంబు మృద్వాస్తరణశోభితంబు కౌశేయాంబరవేష్టితంబునగు పల్లకిఁదెప్పించి యప్పంకజాక్షిఁ దానిబై నెక్కించి మహావైభవముతోఁ గన్యాకుబ్జనగరంబునకుం దీసికొనిపోయి.