పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్త్రీజన్మము.

63

   శ్వరుఁ బెండ్లియాడి తమిఁబె
   క్కురఁ బుత్రులఁగనినకథ తగుంజిత్రంబై .

పుత్రా! తచ్చరిత్రం బెఱింగించెద నవహితుండవై యాలింపు మొక్కనాఁడు నారదమహర్షి ప్రహర్షపులకితగాత్రుండై

క. హరినారాయణ దామో
   దర కేశవ వాసుదేవ దానవవైరీ
   మురహరసురవరపూజిత
   చరణ రమారమణ భక్తజనహృచ్ఛరణా.

అని విపంచిపై శ్రీహరిం గీర్తింపుచు నమ్మహాత్ముని సేవింప శ్వేతద్వీపముకరిగి తదభ్యంతరమంది రంబున.

గీ. ప్రక్కనిలఁబడి సురటిచేబట్టి దుగ్ధ
   వారినిధిపట్టి వీవ శృంగారలీల
   లమరఁ నర్మోక్తులాడు చత్యంతవిభవ
   మునవసించిన హరిఁగనుంగొనియెఁదపసి.

క. అనిమిషముని దవుదవ్వుల
   కనుఁగొని కమలావథూటి గ్రక్కున లజ్ఞా
   వనతముఖియగుచు లోనికిఁ
   జనియెన్ జలదమున నడఁగు చంచలవోలెన్.

తన్నుఁజూచి జలధికన్య దిగ్గున సిగ్గున లోపలికిఁ బోయినదని తెలిసికొని తన కప్పని తలవంపుగాఁ దలంచి పలుతెఱంగులఁ దలపోయుచుఁ గ్రమంబున నయ్యంబుజాక్షు సమక్షమునకుం జని నమస్కరించుటయు దామోదరుం డతని నాదరించి కరుణామేదురములగు చూపులతనిపై వ్యాపింపఁజేయుచు నుచితాసనాసీనుం గావించిదీవించి వత్సా! నీకు సేమమా ఎందుండి వచ్చితివి ? త్రివిష్టపములనేవైన విశేషములు గలిగియున్నవియా! అని యడిగిన నారదుండు చిన్న