పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నలువురు నవ్వుదురని యించుకయుసిగ్గులేకపోయెనే అయ్యయ్యో! ఇది యెక్కడివలపే! వానింబెండ్లాడి భిక్షమెత్తికొనుచు నూళ్లవెంబడి తిరుగుచుందువుకాఁబోలు నారదుఁడైననేమి? వ్యాసుఁడైననేమి? నీవులతా కోమలదేహవు. అతఁడు భస్మరూక్షవిగ్రహుఁడుకోఁతిమొగమేవాఁడు. నీవు నవ్విన పూవులురాలినట్లుండును వెన్నెలలుగాసినట్లు మెఱయును. ఇట్టి నీవాకోఁతిమొగము వానితో నెట్లుముచ్చటింతువు? ఎట్లువిలాసము లందెదవు? నిన్ను వరించి మన్మధునికన్నఁ జక్కనగు రాజపుత్రులనేకులు వార్తలనంవుచున్నారు. వారిలోఁ జక్కనివారినేరి వరింపుము. ఈ విపరీతబుద్ధి విడువుము నీవుపరిహాసమున కట్లంటివా! నిజముగానంటివా చెప్పుమనియెన్ని యోబుద్ధులు గరపిన నవ్వుచునాపువ్వుఁబోడియిట్లనియె.

అమ్మా! రసవేత్తలకు రూపముతో ధనముతోఁ బనిలేదు అవి దగ్ధులు మూర్ఖులునగువారు నారదనము గ్రహింపజాలరు రాజ్య మేమి జేసికొనవలయు వనములోనున్న లేళ్ళుగూడ గీతనాదమువినిధన్యము లగుచున్నవి. మృగములు గాయకునికిఁబ్రాణము లర్పించుచున్నవి. యెఱుంగుదువా మృగములకన్న మనుష్యులే మూర్ఖులు సప్తస్వరాత్మకమైన సంగీతవిద్య శంకరుండెఱుంగు. నారదుఁడెఱుంగు. వారింబోలిన వాఁడు మూడులోకములలో మఱియొకఁడులేడు. మూఢునితోఁ జిరకాలము సహవాసముచేయుటకంటె నుత్తమునితోఁ గడియచాలును గుణహీనుఁడగువాడు ధనవంతుఁడైన నేమి? రూపవంతుఁడైననేమి? అట్టివాఁడు విడువఁదగినవాఁడే బిక్షుకుండైనను గుణవంతుఁడైనచో స్వీకరింపదగినవాఁడే తల్లీ! నీకొక్కరహస్యము చెప్పుచున్నాను. వినుము సప్తస్వరజ్ఞుఁడుగ్రామవేత్త మూర్చనాభేదవిదుండుఅష్టరసజ్ఞుండు దుర్లభుండని యెఱుంగుము గంగాసరస్వతులు కైలాసము నెట్లు పొందించునో స్వరజ్ఞానవిశారదుండట్లు పొందించునుస్వరజ్ఞాన మెఱింగినవాఁడు మనుష్యఁడైనను దేవసమానుఁడు దానినెఱుఁగనివాఁడు దేవుఁడైనను