పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వీణం గట్టిపెట్టునప్పుడు దాపునకుఁ బోయి నమస్కరించి మహాత్మా! నాకు సంగీతప్రవేశము గొంత గలిగియున్నది. గాయకులలో నాకంటె నధికులు లేరని గర్వపడుచుండుదాన. మీసంగీతము వినుటచే నామది తన్మయత్వము నొందినది. ఇట్టి రాగములు ఇట్టి కల్పనలు నేనిదివఱకు భూలోకములో వినియుండలేదు. మీది దేవగానమనితోచుచున్నది. నారదమహర్షికిం గాక మహర్షులకు, గానలాలసత్వ ముండదు. మీరెవ్వరో తెలుపవలయు. నారదమహర్షివై యైనచో నేను మనుష్యకోటిలో నుత్తమురాల నగుదురు. నాజన్మము సార్ధకము నొందఁగలదని పలికిన నామహర్షి నవ్వుచు నిట్లనియె.

యువతీ ! నారదుని రథ నీవిదివఱకు వినియుంటివా యేమి? అతనియందు నీకంత ప్రీతి యేమిటికి గలుగవలయును. చెప్పుమనుటయు నక్కుటిలాలక మహాత్మా! మునులలో నారదునివంటి యుత్తముఁడున్నవాడా? నేను సంగీత ప్రియనగుట నాకతండు ప్రియుండయ్యె జెప్పితినా? అని పలికిన నతండు నన్ను నారదుఁడే యనుకొనుము. నీ కేరాగము ప్రియమో చెప్పుము. ఆరాగము పాడెదనని బోధించెను.

ఆమాట విని యాపాటలగంధి మోము వికసింప నాహా ! నేఁడెంత సుదినము? ఎన్ని దినములనుండియో దేవర దర్శనము సేయ గోరికొనుచుంటి. నేఁటికి నావ్రతము ఫలించినదని మురియుచు నతని పాదంబులకు లలాటము సోక మ్రొక్కుచుఁ పెద్దగా నగ్గించినది. నాఁడు మొద లమ్ముని సంతతము వీణాగానమే చేయుచుండును. ఆచిన్నది యితర వ్యాపారములు విడిచి దాపునఁ గూర్చుండి వినుచుండును. క్రమంబున నామెచిత్తము చిత్తజాయత్తమై యమ్ముని యందు లగ్నమైనది. అయ్యనురాగ మనుదినము వృద్ధినొందు చుండెను. లీలాతరంగితములగు చూపుల నతనిఁజూచుచు మత్స్యమును. బడిశమువలె నతని హృదయ మాకర్షించుచుండెను. మునిహృదయము