పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కాశీమజిలీకథలు - పదియవభాగము.

క. మీరే పోయిన నింకఁ గు
   మారుం డేమిటికి? నాకు మడిసెదను బలా
   త్కారముగా నగ్నింబడి
   వారక మిముఁ గలిసికొందు వైకుంఠమునన్.

అని దుఃఖించుచు నింధనములం జేర్చి యగ్నింబడఁ బ్రయత్నింప నెఱింగి తద్రక్షకుండైన బ్రాహ్మణుండు వారించుచుఁ బుత్రీ ! నీ గర్భంబున నుత్తముం డగు నర్భకుండున్నవాఁడు. నీవు మృతి నొందిన మహాపాతకముజుమీ! పతీ వియోగదుఃఖంబు సుతలాభంబున మఱతువుగాక యూరడిల్లుమని బోధించి యయ్యుద్యమంబు మానిపించెను.

మఱియు

క. ఆపన్నసత్వయగు నా
   గోపిక యాపగిది మదిని గుండంగ నెలల్
   బ్రాపించెఁ బొడమె గొమరుఁడు
   రూప కళాకాంతి భాసురుఁడు శుభవేళన్.

అప్పుడు పెక్కండ్రు పెద్దముత్తైదువు లరుదెంచి సూతికా గృహంబున మధ్యందినమార్తాండ తేజంబునఁ బ్రకాశించుచున్న యక్కుమారశేఖరుం జూచి యాశ్చర్యమందుచు వాని చక్కఁదన మభివర్ణించుచుఁ దీర్ధములాడించి పాలం గుడిపించుచు ముద్దుపెట్టుకొని పెద్దతడవందుండి యిడ్లకుం పోయిరి.

ఆవిప్రుండును శంఖచక్రాదిరేఖాచిహ్నిత కరచరణుండగు నాడింభకుం గాంచి వానికారణ జన్మునిగాఁ దలంచి పోషింపుచుఁ గ్రమంబున జాతకర్మాదివిధుల నిర్వర్తించి యబ్బాలునకు నారదుఁడని పేరుపెట్టెను. అని చెప్పిన విని గోపకుమారుండు మణిసిద్ధునితో గురువర్యా ! ఆబ్రాహ్మణుఁ డాబ్బాలుండు నారదుని యవతారమని