పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతీకథ.

47

రుండు కుమారుం డుదయింపఁగలఁడని యుపదేశించి నిరతిశయ తపస్సంపన్నుడైన యొకానొక భూసురునకుఁ బోషింప బహు ధన యుక్తముగాఁ దనభార్య నప్పగించి తగులము వదలెఁగదాయని ముఱియుచు తనయాస్థి యంతయు బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి విరక్తుండై బదరికారణ్యంబున కుంబోయి యందుఁ గంగాతీరంబున మాసమాత్రంబు యోగంబుపట్టి యెల్లమునులుసూచుచుండ విష్ణు సాయుజ్యమునొందెను.

క. ద్రుమిళుం డింతటివాఁడని
   యమివర్యులకైనఁ దెలియదహహా పలుయో
   గములం బ్రాపింప నశ
   క్యమువైకుంఠము లభించె నతిసులభముగాన్ .

కలావతియు నిలామరునింట వసించి యెవ్వరివలననో భర్తృ మరణ వృత్తాంతము విని యత్యంత దుఃఖావేశముతో విలపించుచు,

క. తనయునిగని వెసరమ్మని
   నను నిటకుం బనిచి ప్రాణనాధ! విరక్తిన్
   వనమున కేగి సుయోగము
   నను దనువుం దొరగు టిది ఘనంబగు తెరువే!

గీ. కొడుకుగాంచి నీదు నొడివెట్టి తగముద్దు
    లాడఁజూచి వేడ్క నందఁదలఁతు
    నేది లేకపోయె నెవ్వరు మత్పుత్రు
    నరసి యింక ముద్దులాడువారు.

చ. సుతుఁగనఁగోరినాఁడు మిము సుందరవేషముతోడఁజేరి నే
    రతికభిలాషజేసిన భరంబగు సిగ్గును జింతయుం దయా
    ళుతయుఁ దగంగ నన్యు సుకలుం బతిగా భజియింపుమంచుఁ బ
    ల్కితి రిది నామనంబును జెలింపఁగఁజేయుచు నుండె నయ్యయో!