పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నిప్పుపలె మెత్తనగావించినది. ఇసిరో మేదోమాంస చర్మాస్థి పుంజంబగు కాయంబుజూచి మోహపడితినే! అహా! యేమి స్త్రీ మోహము. ఎట్టివారినైన మోసముజేయక మానదు. అని నిందించు కొనుచు పో, పొండు మీరిందుండరాదు. అని వారిం కసరి తరిమివైచి తాను స్నానమున కరిగెను.

మేనకయు నేఁటికి బ్రతికిపోయితిని. ఇతండు శపింపక విడిచెనిది పూర్వపుణ్యమేయని ముఱియుచు నాకమున కరిగినది. గోపిక యుఁ త్రిభువన సామ్రాజ్యమబ్బినట్లు సంతసించుచు నమ్మునివరునకు మ్రొక్కి యొకమార్గంబునంబడి తనగ్రామమున కరుగుదెంచి భర్తకు నమస్కరించి చేసిన కృత్యంబంతయు బోధించుటయు నతండు పరిశీలించి కలావతి కిట్లనియె.

క. తరుణీ! నీగర్భంబునఁ
   బరమతపోనిష్ఠుఁడైన బాహ్మణు తేజం
   బరుదుగ మెఱయుచునున్నది
   యురుతేజస్ఫూర్తిఁ బుత్రుఁ డుదయించుఁజుమీ.

ఉ ఏసతిగర్భమందు జనియించునో వైష్ణవసత్తముండ హా!
    ఆసతిభర్తయుం గులజులందఱు దివ్యవిమానసంస్థులై
    వాసిగ జన్మరోగభయవర్జితమై తగు విష్ణులోకము
    ల్లాసముతోడఁ బోవుదు రలంకృతభాసుర దివ్యగాత్రులై .

క. నీకతమున మెఱసెఁగదా
   మాకులమెల్లను వెసం గుమారుంగనఁగాఁ
   గోకన్తని! తగుధనముం
   గైకొని యొక విప్రునింటికడకుం జనుమా!

నీవిఁక శూద్రాన్నంబు గుడువరాదు. బ్రాహ్మణశుశ్రూషా నిరతవై నిరంతరము నియమయుక్తినందు వసింపుము, విష్ణుభక్తాగ్రేస