పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతీకథ.

45

మంబులఁ గోసికొనివచ్చి యర్పించుచుఁ దరుఁ లతాగుల్మాదుల కాలవాలములు గట్టుచుఁ బర్ణశాల వేదిక లలికి మ్రుగ్గులు పెట్టుచుఁ జెంత గూర్చుండి తాళవృంతమున వీచుచు నతనిశుశ్రూషఁ జేయుచుండెను. .

అతం డనురాగముతో నొకప్పుడు గోపీ! నీ వేమైన బాడగలవా? యని యడిగిన నక్కాంత సంతసించుచు పికస్వర వికస్వర స్వరంబుల మాధుర్యముగాఁ బాడి యా జడదారి మదిం బెడదారిఁ బడఁజేసినది. అమ్మహర్షి యేదియో నెపంబున గోపికం జీరుచుండును. లేనిపోని పనులు కల్పించి పల్కరించుచుండును. క్షణకాలము గోపిక గనంబడనిచోఁ బదిసారులు బిలుచుచుండును. ఇట్లుండ దైవికముగా నెక్కడికో పోవుచు మేనక యాశ్రమమున కరుదెంచి కలావతితో ముచ్చటించుచు నొకనాఁ డందు వసించినది. ఉబుసుపోక యొక లతాడోలికనెక్కి యా దేవకాంత వింతపాటలు పాడుచు నూగుటయు గాశ్యపుండా గానమాలించి స్మారవికారముతో నందు వచ్చి చూడ గాలిచే పలువదొలఁగి తదీయ మృదూరుస్త నజఘనంబులు బయల్పడుటయు నక్కాంచన గర్భాన్వయ తిలకంబునకుఁ దటాలున వీర్యము స్ఖలనమై నేలం బడినది.

అవ్విధంబెఱింగి యక్కురంగటనున్న గోపిక యతిరయంబునం జని పదిలంబుగఁ దత్తేజంబు చేతులతోనెత్తి నిశ్శేషముగా గ్రోలి తన్నుఁ గృతకృత్యురాలిగాదలంచికొనియె. నా కాశ్యపుఁడును దన ప్రమాదము దెలిసికొని వగచుచు అయ్యో! నేనెంత మూర్ఖుఁడ నైతిని! యోగభ్రష్టుండనగుచుంటినను జ్ఞానమే లేక పోయినదే చీ! చీ! పామరుఁడువోలె నీ గోపికమూలమున నా యుర్ధ్వరేతస్కత్వంబు పటాపంచలుచేసికొంటినే! హరిహరీ! యెంతప్రమాదము జరిగినది! మొదట నీమదవలితో నెంతయో చెప్పి చివరకు నగాధకూపములో బడిపోతినిగదా. ఈ స్త్రీసాన్నిధ్యదోషంబు లక్కవంటి నామనసును