పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కీటంబు గఱచినది. ఎట్లు గంటువడినదియో చూచితిరా! అప్పుడుకూడ మిమ్ముఁ బిలిచితినికాను. నన్నేమిటికి బొమ్మనుచుంటిరి? అని చెప్మిన నతండు మణిదర్పణమువలె మెఱయుచున్న యా చిన్నదాని కపోలమంటి చూచి వెనుకటి మాట యంతయు మఱచి మోహావేశముతో అయ్యో! పాపము నీ గండంబు దుండగపు కీటకము గఱచినదా. అక్కటా మిక్కుటముగా గంటు వడినదిగదా. ఇది నీ ముఖ చంద్రబింబమునకుఁ గళంకమువలెఁ గ్రొత్త యందము గలుగఁ జేయుచున్నది. అని పలుకుచు వ్రేళ్లతోఁ దుడిచి పడఁతీ ! నీ వింతటినుండి యీ పచ్చికలోఁ బండుకొనవలదు. మాపర్ణశాలకు రమ్ము. అందలి వేదికపైఁ బండుకొందువుగాక. ఈమాట నీకు వెనుకనేచెప్పితంగాదా! అని పలుకుచు నతండు తటాకంబున కరిగి స్నానముజేసి పర్ణశాలకుఁ బోయెను.

గోపికయు నతని పలుకులు తలుంచి యాహా! ఆ మహామహుని ఱాంతివంటి హృదయము నా కతంబున విచ్ఛిన్నము కాఁజొచ్చినది గదా. మత్కపోలతలస్పర్శంబున నతని మేనఁ బులకలు జనించుట మారవికారముకాక మఱియేమి? అయ్యో దీనివలన నాకు మఱియొక పాపము జుట్టబెట్టుకొనునేమో? మృగమువంటి మహర్షిని స్మరలీలలో దింపుచుంటినే! అని తలంచుచుండ నతండు పర్ణశాలనుండి గోపీ! గోపీ! యిటురా! అని పెద్ద కేక వైచెను.

ఓ! యని పలుకుచు నక్కలికి తదంతికంబున కరిగి ప్రాంజలియై దూరముగా నిలువంబడినది. తదీయ రూపాతిశయ మాపాద మస్తకముగాఁ బరిశీలించినంత నతని మూర్ధ్వరేతస్కత్వ మధోముఖముగా మారినది. అబలా? ఇఁక నీ వా పచ్చికలోఁ బరుండవలదు. ఇందే యుండుము, మద్భుక్తశేషంబు భుజించుచుండుమని పలికిన సంతసించుచుఁ గళావతి క్రమంబునఁ జనువుచేసుకొని దేవతార్చనకై కుసు