పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతీకథ.

43

పుట్టంబు విప్పి పిండికొనుచున్న యాచిన్నదాని యవయవలావణ్యంబు జూచి హృదయము చలింప నందు నిలువంబడి గోపీ! పాపము రాత్రి వానం దడిసితివి కాఁబోలు పర్ణశాలకు రాలేకపోయితివా ? అని యడిగిన విని చెలఁగుచు నచ్చెలున తళ్కు చూపుల నతనిఁ జూచుచు స్వామీ! మీసాన్నిధ్యంబున నుండ నన్ను జడి యేమి జేయఁగలదు ? ఈసారి వానవచ్చిన నట్లువత్తును లెండని సమాధానము జెప్పినది.

శరచ్చందనిభంబగు నమ్మగువ మొగంబు జూఁచి యతండు చిత్తంబు సంకల్పభవాయత్త మగుటయు సీ ! ఇ దెక్కడి మోహము ప్రమాదమందితినే యని బుద్ధి మరలించుకొని కాసారంబునకుఁ బోయేను. స్నానము చేయుచున్నను ఇంటికివచ్చి కన్నులు మూసికొని జపముజేసికొనుచున్నను నాచిన్నదాని మొగము కన్నులకుఁ గట్టిన ట్లగపడుచుండెను. ఆ దరహాస మా చూపు లా మాటలు దలంచుకొనుచుండ నతని చేఁతినుండి జపమాల జారి నేలంబడినది. అదరిపడి తన ప్రమాదము తెలిసికొని అయ్యయ్యో! ఇదియేమి కర్మము నాచిత్తం బీశ్వరాయత్తముగాక యత్తరుణిమీఁదకుఁ బోవుచున్న దేమి ? సీ ! స్త్రీసాన్నిధ్యంబు తపసులకుఁ గూడదని చెప్పిన మాట తథ్యమగును ఱేపు దాని నీయాశ్రమమునుండి యవ్వలకుఁ బొమ్మని చెప్పెదం గాక యని తలంచుచు నాఁ డెట్టకే మనసుం బట్టికొని జపము గావించుకొనియెను.

మఱునాఁడు స్నానంబున కరుగుచు గోపీ యిటు రా నీకతంబున మాజపంబున కంతరాయము గలుగుచున్నది. నీ విఁక నిందుండ రాదు. ఎందేనిం బొమ్మని పలికిన విని యక్కలికి కలికిచూపుల నతనిం జూచుచు స్వామీ! నే నేమి యపరాధము జేసితీని? మీరు రమ్మన్నను మీపర్ణశాలకు రానైతిని. రాతిరి నా చెక్కిలి యొక్క