పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతీకథ.

41

యున్న కాశ్యపుండను బ్రాహ్మణోత్తముంగాంచి గ్రీష్మకాలమధ్యాహ్న మార్తాండతేజమువోలె దుర్నిరీక్ష్యంబగు తదీయతేజంబు గన్నులకు మిఱిమిట్లు గొలుపవెరగందుచు దూరమున నిలువంబడి నమస్కరించుచు,

గీ. ఇతఁడు హరిభక్తుఁడుత్తమ వ్రతరతుండు
    బ్రహ్మ తేజఃప్రపూర్ణ విగ్రహుఁడు విప్ర
    వంశభూషణుఁ డిమ్మహావరుని బొంది
    పడసెదనుగాక సుగుణాఢ్యుఁ గొడుకునేను.

అని తలంచి యమ్మహర్షి స్నానమున కఱుగు మార్గమధ్యంబున శృంగారచేష్టలు వెలయింపుచు వసియించినది. కాశ్యపుండునుకొండొక వడికిఁ దపోనిష్ఠ చాలించి స్నానంబుసేయ నా ప్రాంతమందలి జలా కరంబున కరుగుచు దారిలో దివ్యరూపంబునం బ్రకాశించు నమ్మించుబోడిగాంచి వెరగంది జవ్వనీ! నీ వేవ్వ తెవు? ఎవ్వనిభార్యవు? ఇవ్విపినంబున కేమిటికి వచ్చితివి? సీయొయ్యారంబుసూడ బుంశ్చలివివలెఁ దోచు చుంటివి. దాచక నీయుదంతము చెప్పుమని యడిగిన నయ్యెప్పుల కుప్ప లేచి నమస్కరించుచు నిట్లనియె. దేవా! నేను గోపకులసంజాతను ద్రుమిళుండను గోపశ్రేష్ఠుని భార్యను. నా పేరు కళావతి యండ్రు. నేను భ క్తయాజ్ఞవడువునఁ బుత్రార్ధినై మీకడ కరుదెంచితి. నాయందు వీర్యాధానంబు గావించి మంచికుమారుం దయచేయుఁడు. సర్వభక్షకుడైన పావకునకుం బోలెఁ దేజశ్శాలులకు నేపనివలనను దోసములంటవు. నా యభీష్టంబు దీర్పుఁ డిదియే నాయాగమన కారణంబని ప్రార్థించిన విని యాబ్రాహ్మణుఁడు భ్రుకుటీవికటనిటలుండై కటంబు లదర పండ్లు పటపటం గొఱుకుచు నిట్లనియె.

ఓసి రంకులాడీ ! నీవు నాకు శాస్త్ర ముపదేశించుచుంటివా? చాలుఁజాలు. జ్ఞానదుర్బలుండైన బ్రాహ్మణుఁడు శూద్రపత్నిం