పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పించుచుందును. నీవును మదసమర్ధత్వంబు గ్రహించి రట్టుసేయక సతీధర్మంబు నెరవేర్చుచుంటి విది లెస్సయగుతెరు విందులకు దేవతలు మెచ్చుదురు. అది యట్లుండె. నీవిప్పుడు సంతానాపేక్షం జేసి కామాభిలాష సూచించితివి కావున నాయుపదేశంబొండు వినుము. నీ విప్పు డెందేనింబోయి యుత్తమపురుషునివలన వీర్యాధానంబువడసి రమ్ము. దానం బుత్రునిం బడయుదువుగాక. ఇది శాస్త్రదూష్యంబు గాదు. కులాభివృద్ధికై పూర్వు లాచరించిన పని. పురాణముల వ్రాయఁబడి యున్నదని యుపదేశించిన విని యవ్వనితారత్నం బొక్కింతసేపు ధ్యానించి యిట్లనియె.

ప్రాణేశ్వరా! నేను మీయాశయము గ్రహింపక యిట్లడిగినందులకుఁ జింతించుచుంటి. క్షమింపుఁడు మీపాదసేవకన్న నాకు సంతాన మెక్కువదికాదు. ఇఁక త్రికరణముల నామాట తలపెట్టనని పలికిన నతండనునయపూర్వకముగా నిట్లనియె. ప్రేయసీ! నీ వడుగకున్నను నీ కీమాట చెప్పఁదలఁచికొనియే యున్నాను. ఇది తప్పుపనికాదు, మరియొక తెరువునఁ గులాభివృద్ధి బడయఁజూలము పొమ్ము. ఉత్తమపురుషు నరసికొమ్మని పలుకుచు బలవంతముగా నామె నిల్లు కదలించెను.

గోపికయు భర్తృ నిర్బంధమున శుభముహూర్తమున నిల్లువిడిచి యొక మహారణ్యమార్గంబునఁ బడి పోవుచు ,

గీ. వర్ణములకెల్ల గురువు విప్రవరుఁడరయ
    నందు సత్కర్మనిరతుఁ డత్యధిఁకుడంత
    కన్న శ్రేష్ఠుండు సత్తపఃకరణశాలి
    యట్టితాపసుఁడెందు నొప్పారునొక్కొ.

అని తలంచుచు నగ్గోపిక యోపికతోఁ బెక్కు దేశములు తిరిగి తిరిగి యొక్క వనంబునఁ దపోనిష్ఠాగరిష్టుండై యోగధ్యానరతుండై