పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలావతికథ.

35

చున్నవియో మహామాయ యెవ్వని స్వాధీనములోనున్నదియోఎవనియాజ్ఞ బ్రహ్మ సృష్టించునో రుద్రుఁడు లయముజేయునో యట్టి నారాయణునియాజ్ఞ లేక యెవ్వరు నే పనియుఁ జేయజాలరు. నీవు నిజము దెలిసికొని మమ్ము శపింపుము.

మాలావతి — (వారిమాటలు విని యాబ్రహ్మచారి మొగము చూచుచున్నది)

బ్రహ్మచారి – (నవ్వుచు) సాధ్వీ ! నీవు వీరి మాటలన్నియు వింటివిగదా! వీరిలో నీభర్తను హరించినవాఁ డెవ్వడో చెప్పుము వానిని శిక్షించెదంగాక. మఱియు నన్నేమియడిగెదవో యడుగుము.

మాలావతి — స్వామీ! వారి యధికారపుమాటలు వారు సెప్పెరి. వారితో నాకునిమిత్తములేదు. నీవు మొదట నాభర్తం బ్రతికించెదనని శపథముజేసితివి. అమాటయేనిలుపుకొనవలయును.

బ్రహ్మచారి -- వేల్పులారా! మహాపతివ్రతయగు. మాలావతి తనభర్తంబ్రతికింపవలయునని కోరుచున్నది. లేనిచో లోకముల భస్మము జేయునఁట. సతీశాప మమోఘముగదా. పరమేష్టీ! కర్తవ్య మేమియో చెప్పుము.

బ్రహ్మ – వటూత్తమా! నీవెవ్వఁడవో మాకుఁ దెలియదు వాక్పటుత్వముగలవాఁడ వగుదువు. మానిమిత్తమువాదించి యామె కోపము జల్లారఁ జేసితివి.

ఈగంధర్వకుమారుండు నా ---------------------- మఱి కొంతకాలమువఱకు నాశాపంబంటకుండఁ జేయఁగలను. ఇప్పుడీయాపద దాటినపిమ్మటం జూచుకొందముగాక. అనిపలుకుచుఁతన కమండ లూదక మతనిపైఁ జల్లినంత నతఁడు గదలఁజొచ్చెను. శివుండు జ్ఞాన మిచ్చెను. వహ్ని జఠరాగ్ని, కాముఁడు కామబలము, వాయువు ప్రాణములు, సూర్యచంద్రులు దృష్టులునిచ్చిరి వేల్పులెల్ల తమతమ