పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కన్యయె బాధ్యురాలు నా కేమియుందెలియదు.

మాలావతి – (మృత్యుకన్యకంజీరి) ఓసీ మూర్ఖురాల నీయాకారము చూచినంతనే ప్రాణములుపోవఁ గలవు. నీవాఁడుదానవు కావా? భర్తృవియోగదుఃఖమెట్టిదో నీకుఁదెలియదా? నాభర్తనేమిటికిఁదీసికొని పోయితివి! దారుణశాపంబున నిన్ను నాశనముజేసి లోకముల కుపకారము గావింతుఁ జూడుము.

మృత్యుకన్య - (గడగడవడంకుచు) తల్లీ ! పరమేష్ఠి యిట్టి దారుణకృత్యములు సేయుటకే నన్ను సృష్టించెను. తేజస్వినివగు నీ యట్టి మహాపతివ్రతయే నన్ను భస్మముసేయ సమర్ధురాలగుచున్నది. నన్ను నాశనముజేయుము. భువనంబుల కుపకారమగుఁగాక. అమ్మా నా కేమియు స్వతంత్రములేదు నాభర్తయగు కాలపురుషునిచేఁ బ్రేరేపింపఁబడి ముందుగా బిడ్డల ననిపి తరువాత జీవకోటిని వశముజేసికొందును. ఇదియే నాపని నీభర్తను స్వతంత్రించి నేను దీసికొనిరాలేదు. ఆకారణము నాభర్తనే యడుగుము.

మాలావతి --- (కాలపురుషుం జూచి) ఓయీ! నీవు కర్మ సాక్షివి సనాతనుఁడవు. నారాయణాంశము నీయందున్నది నీకు నమస్కరించుచున్నదాన. నాభర్త నేమిటికి నీభార్య కప్పగించితివి ? ఈద్రోహకృత్యము నీవే చేసితివని యందఱు నీపై త్రోసివేసిరి. తగు కారణము సెప్పకున్న నిన్ను భస్మముజేసెద నాసామర్థ్య మెఱుఁగుదువా?

కాలపురుషుఁడు - తల్లీ! నీభర్తను దీసికొనిపోవుటకు నే నెవ్వఁడను? ఈమృత్యుకన్యక యెవ్వతె. యముఁ డెవ్వఁడు? వ్యాధులేమి చేయఁగలవు ? ఇందులకు మాకే స్వతంత్రమున్నచో రెండుగడియలలో బ్రహాండములన్నియుఁ గబళింపకపోవుదుమా ? ఏపరాత్పరునికి బద్ధులై సూర్యచంద్రులు పంచభూతములు సంచరించు