పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలావతికథ.

33

     వికట దంష్ట్రాభయానకరక్త నేత్రుఁడై
                రత్తాంగరాగవస్త్రములుదాల్చి
     సర్వసంహారదక్షస్వరూపముతోడ
                వెలయుకాలుఁడువీఁడె కలికి! చూడు

గీ. మరసివరియించె మృత్యుకన్యాలలామ
    వీనిమున్ను స్వయంవరవిధులనితఁడు
    జమునకుహితుండు వ్యాధిపుంజములనెల్ల
    గడుపునిండంగ మున్ను దాగన్న తండ్రి.

క. ఆలమృత్యుకన్య చెంగట
   నిలిచి మహావృద్ధులయ్యు నిపుణత శిశువుల్
   వలెఁ బాలుగ్రోలుదురు వ్యా
   ధులువారదె జనకునూత దుర్జయులుసుమీ.

క. యముఁడీతఁడు ధర్మా ధ
   ర్మములెఱిఁగినప్రోడ చూడు మధురాధర! రో
   గములును మృత్యువు కాలుఁడు
   సమముగనడిపింతు రితని శాసనమెపుడున్.

సాధ్వీ! ఆమెమృత్యుకన్యక పెద్దకూతురు జరాదేవి. ఆమువ్వురు వాతపైత్య శ్లేష్ములు కుమారులు వారందఱు ఆసంతతివారే వారి నే దేవియడుగఁ దలంచిన నడుగుమని పలికినవిని యక్కలికి తొలుత యము నుద్దేశించి.

మాలావతి - ధర్మరాజా! నీవు సమస్తధర్మముల నెఱింగిన వాడవుగదా? నాభర్తనేమిటికి మృత్యువశుంజేసితి? నీకుజాలిలేదా!

యముఁడు - అమ్మా! మాలావతి! కాలము మూఁడనివాని నెవ్వరుఁజంపనేరరు. కాలపురుషునియాజ్ఞ బూని యతనిభార్య మృత్యు కన్యక జంతువులసమయించుచుండు. కావున నీమాటకు మృత్యు