పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మాలావతి -- వటూత్తమా! ఎట్టివారికిని స్వకార్యమునకై ప్రయత్నించుట సహజము కార్యతత్పరులు భావాభావములఁ దెలిసికొనజాలరు. నాభర్తం బ్రతికింపకపోయినచోఁ దప్పక వేల్పులనెల్ల శపింపకమానను నాశాప మెవ్వఁడడ్డము సేయునో చూతుగాక.

బ్రహ్మచారి — అమ్మా! మాలావతి! నీవుమహాపతివ్రతవు. నీశాప మమోఘమని యెఱుఁగుదును. ఇంచుక నిదానించుము నాకు సర్వరోగచికిత్సలుం దెలియును. ఏడుదివసంబులక్రిందట మృతినొందిన వానిం బ్రతికింపఁగలను నీభర్త యేరోగముచేత మృతినొందెనో చెప్పుము. మృత్యుజరావ్యాధిపుంజములు నావశములోనున్న వి. నీవు కోరినవానినెల్ల రప్పించి నీయెదుటఁ బెట్టెదను.

మాలావతి - (మోమెత్తి యతనింజూచి) మహాత్మా! నీవు ప్రాయంబున జిన్న వాడవైనను యోగవేత్తలకన్న బ్రౌఢముగాఁ జెప్పుచుంటివి. నీవునాపతింబ్రతికింపఁగలవు సంతోషమయినది. ఏరీ కాలమృత్యుకన్యాదుల రప్పింపఁగలనని చెప్పితివి. వారినొకసారినాయెదుట బెట్టుము కొన్ని మాటలడిగెదంగాక!

బ్రహ్మచారి - వారినెల్లంజీరి రప్పించి యామే యెదుట నలువంబెట్టి,

ఉ. నల్లనికాంతిగల్గి యరుణంబగు వస్త్రములంధరించి హా
     సోల్లసితాస్యమొప్పఁద్రియుగోరు కరంబులతోడ భీతినం
     ధిల్లగఁజేయు రూపున ననేకులు వ్యాధిసుతుల్ భజింపఁగా
     నల్లదెమృత్యుకన్య కనుమా! పతికాలునిమ్రోలనిల్చెడిన్ .

సీ. ఆఱుమోములు పదియాఱుబాహువులు ని
              ర్వదినాల్గునేత్రముల్ బాదషట్క
    మమర గ్రీప్మోరుమార్తండ తేజముగల్గి
              యసిత దేహచ్ఛాయలెసఁగమెసఁగ